Konda Laxman Bapuji | ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం.. కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆయన 111వ జయంతి వేడుకలను పద్మశాలీ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, గౌరవ అధ్యక్షుడు వాసాల రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
Konda Laxman Bapuji | ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం.. కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్
కరీంనగర్ (తెలంగాణ చౌక్), సెప్టెంబర్ 27 : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆయన 111వ జయంతి వేడుకలను పద్మశాలీ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, గౌరవ అధ్యక్షుడు వాసాల రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజం కోసం, ప్రజల హక్కుల కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. తొలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ప్రజా ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసి పోరాట పంథాను ఎంచుకున్నారని గుర్తుచేశారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, పోరాటం, సేవలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. జయంతి వేడుకలను పురస్కరించుకుని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు మెతుకు సత్యం ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వాసాల రమేష్, చొప్పరి జయశ్రీ, మాసం గణేష్, తేళ్ల లక్ష్మీ రమేష్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, వేముల కవితా చంద్రశేఖర్, పాడిశెట్టి లక్ష్మీ భూమయ్య. పద్మశాలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వోల్లాల కృష్ణ హరి, కోశాధికారి అలుస భద్రయ్య, పోపా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ, యువజన సంఘం అధ్యక్షుడు గుడిమల్ల శ్రీకాంత్, పోపా మాజీ అధ్యక్షుడు చేరాల మల్లికార్జున్ దేవ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వోడ్నాల రవీందర్, ప్రచార కార్యదర్శి మార్త ప్రకాష్, జిల్లా నాయకులు స్వర్గం నర్సయ్య, వంగర ఆంజనేయులు, వేముల చంద్రశేఖర్, అడిచర్ల రాజు, మెతుకు వంశీకృష్ణ, వంగర రవీందర్, మెతుకు కృష్ణ చైతన్య, గర్దాస్ సతీష్, గుండేటి శివ, అరుకాల నాగేందర్, రెడ్డి సంఘం జిల్లా నాయకుడు వాడే వెంకటరెడ్డి, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..చిగురుమామిడి : చిగురుమామిడి మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కోడం కనకయ్య, మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మండల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వంగర మల్లేశం హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్ఐ రజనీకాంత్ రెడ్డి, జీపీవో రఫిక్, పద్మశాలీ సంఘం మండల ప్రధాన కార్యదర్శి మంచికట్ల కనకయ్య, యేన్నం వెంకటేశం, బైరి శ్రీనివాస్, కూరపాటి దిలీప్, మెరుగు రాజేశం, కూరపాటి కిషోర్, రాములు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో కానరాని వేడుకలు…
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించకపోవడం పట్ల బీసీ సంఘాల నాయకులు, ఉద్యమకారులు అధికారులను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎంపీడీవోను రామ్మోహన్ చారిని వివరణ కోరగా చేయూత పింఛన్ల పరిశీలనలో బిజీగా ఉండడం వల్ల ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం చేయలేకపోయామని తెలిపారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమ నాయకుడు, సంఘసేవకుడు, మాజీ మంత్రికి కి ఇచ్చే గుర్తింపు ఇదేనా..? అని పలువులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vivek Venkataswamy | పెద్దపల్లి వివాదంతో నాకేం సంబంధం.. కాంగ్రెస్ ఇన్చార్జి సందీప్‌తో వివేక్
Bridal Weight Loss | పెండ్లి చూపుల్లో బొద్దుగా.. పెండ్లి నాటికి స్లిమ్‌గా! అందం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారా?
Kaleshwaram | కాళేశ్వరా.. నీ గుడి పూర్తయ్యేదెన్నడు?.. పురాతన ఆలయం కూల్చివేసి 4 నెలలవుతున్నా ముందుకు సాగని పనులు
Nagarjuna Sagar | సాగర్‌లో ఏపీ దాదాగిరీ.. కుడికాలువకు అక్రమంగా నీటి విడుదల.. పల్నాడు గోల ఉండగానే ఆంధ్రా ఇష్టారాజ్యం
Truck Park Lands | ట్రక్‌పార్క్ భూములపై నం.2 మంత్రి కన్ను.. నేషనల్ హైవే వెంబడి వందల కోట్ల భూములకు ఎసరు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

