వీణవంక/ మానకొండూర్ రూరల్, మే 24: మండలంలోని ఎలుబాక గ్రామానికి చెందిన పొన్నాల అనిల్ అనే వ్యక్తి పనిపై పెద్దపల్లికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నాల అనిల్ మంగళవారం ఉదయం తన ఇంటి నుంచి కారులో బయలుదేరాడు.
మానకొండూర్ మండలం ఊటూరు గ్రామ శివారుకు చేరుకునే సరికి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే కారులో ఉన్న అనిల్‌తో పాటు మరో ఇద్దరు వెంటనే కిందికి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల విలువ చేసే కారు దగ్ధమైనట్లు అనిల్ తెలిపాడు.