Karimnagarముకరంపుర, జులై 27 : కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ ఎన్నికకు నగరంలోని పద్మనగర్ లో గల యూనియన్ కార్యాలయంలో సోమవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎన్నికల అధికారి మహమ్మద్ జలాలోద్దీన్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.
ఈ నెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.30 న నామినేషన్ల పరిశీలన, 31న నామినేషన్ల ఉప సంహరణ, ఆగస్టు 5న రహస్య బ్యాలెట్ విధానంలో ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. జిల్లాలో 16 మండలాల్లోని 139 ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాల అధ్యక్షులు ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు.