పాము కాదు.. మలుగు పాపెర
..పక్క చిత్రంలో ఓ వ్యక్తి చేతిలో ఉన్నది పాము అనుకుంటున్నారా..? భయంలేకుండా చేతిలో పట్టుకున్నాడేంటి అనుకుంటున్నారా..? ఇది పాము కాదు, చాలా అరుదుగా దొరికే మలుగుపాపెర చేప! చాలా అరుదైన జాతి. చెరువులు, రిజర్వాయర్లలో ఉండే ఈ చేప, దొరికితే అదృష్టమే.
..పక్క చిత్రంలో ఓ వ్యక్తి చేతిలో ఉన్నది పాము అనుకుంటున్నారా..? భయంలేకుండా చేతిలో పట్టుకున్నాడేంటి అనుకుంటున్నారా..? ఇది పాము కాదు, చాలా అరుదుగా దొరికే మలుగుపాపెర చేప! చాలా అరుదైన జాతి. చెరువులు, రిజర్వాయర్లలో ఉండే ఈ చేప, దొరికితే అదృష్టమే. అనేక ఔషధ గుణాలను సొంతం చేసుకున్న ఈ ఫిష్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని తింటే నడుం, మోకాళ్ల నొప్పులు ఇట్టే నయమైపోతాయి. శుక్రవారం మంథని మండలం అరెంద వద్ద సరస్వతీ బరాజ్ బ్యాక్ వాటర్‌లో శుక్రవారం రొయ్యల కోసం మంథని పట్టణం కూచిరాజ్‌పల్లికి చెందిన మత్స్యకారుడు చెన్నూరి సాయి పెట్టిన బుట్టలో చిక్కింది.
తొలుత పామే అనుకొని తీసేందుకు భయపడ్డ మత్స్యకారుడు, ఆ తర్వాత మలుగు పాపెరగా గుర్తించి పట్టుకొని తెగ సంబురపడిపోయాడు. అరుదుగా దొరికే చేపకావడం, ఆరోగ్యానికి మంచిది కావడంతో అక్కడున్నవారు ‘కాస్త డబ్బులెక్కువైనా ఇస్తం’ అని, చేపను తమకు విక్రయించాలని అడిగినా ఆ మత్స్యకారుడు ససేమిరా అన్నాడు.
– పెద్దపల్లి, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Fish
- fishermans
- Peddapally
- shrimp
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

