లోబడ్జెట్‌లో మీ కలల ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నారా..?
ఆధునిక హంగులతో మంచి ఇల్లు కొనాలనుకుంటున్నారా..?
అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా..?
ల్యాండ్‌పై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..?
బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా..?
ఇలాంటి వివరాలన్నీ ఒకే వేదికపై తెలుసుకోవాలనుకుంటున్నారా..?
అయితే మన కరీంనగర్లో రేపు, ఎల్లుండి నిర్వహించే ప్రాపర్టీ షోకు రండి! మీ అనుమానాలను నివృత్తి చేసుకోవడమే కాదు,మీకుఅనుకూలమైన ప్రాంతంలో ఇల్లు, విల్లాలు, అపార్టుమెంట్లను ఎంచుకోండి!
కార్పొరేషన్, ఫిబ్రవరి 7 : ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో కరీంనగర్ వేదికగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభించి, శనివారం రాత్రి 7గంటలకు ముగించనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ ప్రోగ్రాంలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు, అలాగే రుణ సౌకర్యం కల్పించే పలు బ్యాంకులు పాల్గొననుండగా, ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పించారు.
ఇల్లు కొనాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వేదిక ఒక వరంగా మారనున్నది. నిర్మాణ రంగం గురించి ఒకే వేదికపై సకల సమాచారం తెలుసుకునే అవకాశమున్నది. ఈ ప్రాపర్టీ షో కు సంబంధించిన మరింత సమాచారం కోసం 9182777571, 9182777572 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.