Reunion | వీణవంక, అక్టోబర్ 4 : వీణవంక మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్హాలులో వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2009-10 పదో తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో కలిసి విద్యార్థులు మొక్కలు నాటి, నీరు పోశారు.
ఈ సందర్భంగా ఫంక్షన్హాల్లో పూర్వ విద్యార్థులు గురువులకు పూలమాళలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఒక్కొక్కరుగా కుటుంబ సమేతంగా పరిచయం చేసుకొని, సభాముఖంగా కష్టసుఖాలను పంచుకున్నారు. అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆడి, పాడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో 2009-10 పదో తరగతి పూర్వ విద్యార్థులు, పూర్వ, ప్రస్తుత గురువులు పాల్గొన్నారు.