జగిత్యాల విద్యానగర్, ఆగస్టు 29: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రము ఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జగిత్యాలలోని మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాపోటీలను ప్రారంభించి మాట్లాడారు. గతంలో హాకీ క్రీడకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించేదన్నారు. ధ్యాన్‌చంద్ సేవలకు గుర్తుగా యేటా ఆగస్టు 29న క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. తాను ఇక్క డి పాఠశాలలోనే చదువుకున్నానని, చిన్నప్పుడు మినీ స్టేడియంలో ఎన్నో ఆటలు ఆడుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో 400మీటర్ల రన్నింగ్ ట్రాక్ కోసం సీడీపీ నిధులు 10లక్షల కేటాయిస్తున్నామన్నా రు. మినీ స్టేడియంలో బాస్కెట్‌బాల్ కోర్టులో బాస్కెట్ల కోసం లక్ష మంజూరు చేస్తున్నామన్నా రు. మినీ స్టేడియం, ఖిలాగడ్డ చింతకుంట వద్ద ఓపెన్ జిమ్‌లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్క డ జిల్లా క్రీడల అధికారి నరేశ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు చుక్క నవీన్, అల్లె గంగాసాగర్, క్యాదాసు నవీన్, బొడ్ల జగదీశ్, కోఆప్షన్ సభ్యుడు రియాజ్, హెచ్‌సీఏ జిల్లా సభ్యుడు దావ సురేశ్, నేతలు బోగ ప్రవీణ్, అడువాల లక్ష్మణ్, ఆరె తిరుపతి, కాశెట్టి తిరుపతి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు పడాల విశ్వప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ కోరుకంటి రవికుమార్, పెటా జిల్లా కార్యదర్శి అశోక్, శ్రీనివాస్, ఎస్జీఎఫ్ కార్యదర్శి లక్ష్మీరాంనాయక్, పీఈటీలు జమునారాణి, కృష్ణప్రసాద్, అజయ్‌బాబు, భాస్కర్, శ్రీనివాస్, కోటేశ్వర్ రావు, విద్యాసాగర్, వేణు, టీఆర్ఎస్వై అధ్యక్షుడు కత్రోజు గిరి పాల్గొన్నారు.