రూ. 20 కోట్లతో అంబేద్కర్ స్టేడియంలో అభివృద్ధి పనులు
పూర్తయిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
కరీంనగర్ స్పోర్ట్స్, ఆగస్టు28: జిల్లా కేంద్రంలో క్రీడా పాఠశాల అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటు న్నది. రూ. 20 కోట్లతో చేపట్టిన పనులు ప్రస్తుతం తుది దశకు చేరగా, త్వరలోనే అందుబాటులోకి రానున్నది. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణంతో కరీం‘నగరం’ జాతీయ క్రీడ లకు వేదిక కానున్నది. నేడు హాకీ మాంత్రికుడు ధ్యాన్చం ద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకొంటున్న నేపథ్యం లో క్రీడాకళాశాల అభివృద్ధిపై ప్రత్యేక కథనం..
2006లో జిల్లాకేంద్రంలోని మానేరు తీరానా 24 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా పాఠశాల నిర్మాణాన్ని చేపట్టారు. అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆదిలోనే పనులు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పనులకు మోక్షం లభించింది. రూ 9 కోట్లతో భవన నిర్మాణం చేపట్టగా పనులు తుది దశకు చేరాయి. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ చొరవతో రూ 7 కోట్లతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా పనులు పూర్తయ్యాయి.
అంతర్జాతీయ సౌకర్యాలు..
క్రీడా పాఠశాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. సుమారు రూ 9 కోట్లతో వి ద్యార్థుల శిక్షణ కోసం స్టేడియం, స్విమ్మింగ్‌పూల్, రన్నింగ్ ట్రాక్, బాక్సింగ్, హాల్‌లతో పాటు ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ పూర్తయితే జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు కరీంనగర్ ఆతిథ్యం ఇవ్వనున్నది.
స్మార్ట్‌సిటీ కింద రూ. 20 కోట్లు కేటాయింపు..
స్మార్ట్‌సిటీ కింద ప్రభుత్వం నగరంలో క్రీడల అభివృద్ధికి రూ. 20 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అంబేద్కర్ స్టేడియంలో ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. పా ర్కింగ్, షాపింగ్‌మాల్, డైనింగ్‌హాల్, ఫంక్షన్‌హాల్, వసతి సౌకర్యాలు, బాస్కెట్‌బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, ఖోఖో, హ్యాండ్‌బాల్, స్కేటింగ్, హాకీ, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్ బాల్, అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి.
రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం
ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నది. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీకి 2 శాతం రిజర్వేషన్లు కల్పించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు నగదు పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రంలోనే క రీంనగర్ జిల్లా క్రీడా కేంద్రంగా మారింది. అంబేద్కర్ స్టేడియంలో చేపట్టిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ పూర్తయితే జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదిక కానున్నది.