జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
అభివృద్ధి పనుల పరిశీలన
జగిత్యాల అర్బన్/జగిత్యాల రూరల్/సారంగాపూర్ ఆగస్టు 28: పట్టణాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ని గొల్లపల్లి రోడ్డు, మోతె శ్మశాన వాటికల్లో 3 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారుల తో కలిసి శనివారం పరిశీలించారు. జగిత్యాలలో పట్టణంతో పాటు రాయికల్‌కు చెందిన 15 మంది లబ్ధిదారులకు, సారంగాపూర్‌లో 10 మంది లబ్ధిదారులకు సుమారు 5.80 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఆయాచోట్ల ఎమ్మె ల్యే మాట్లాడారు. పట్టణంలో వైకుంఠధామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ 3 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో బర్నింగ్ వార్డు, పాత్వే, గ్రీనరీ, ప్రవేశ ద్వారం, డ్రైనేజీ సిస్టమ్, ఎలక్ట్రిక్ క్రిమిటోరియం, టాయిలెట్స్, లైటింగ్ తదితర పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎంసహాయనిధి వరంలాంటిదని పేర్కొన్నారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతాయని చెప్పారు. కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, బోగ ప్రవీణ్, కౌన్సిలర్లు చుక్క నవీన్, అల్లె గంగాసాగర్, క్యా దాసు నవీన్, కమిషనర్ స్వరూపారాణి, డీఈలు ప్రసాద్, భద్రు, ఏఈలు శ్రావణ్, శరణ్ ఉన్నారు. సారంగాపూర్‌లో వైస్‌ఎంపీపీ సోల్లు సురేందర్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కోల శ్రీనివాస్, నాయకులు గుర్రాల రాజేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ఏలేటి నర్సింహారెడ్డి, గురునాథం మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
విధుల్లో బైక్‌పై పర్యటన
ఎమ్మెల్యే సంజయ్ ద్విచక్రవాహనంపై పట్టణం లో పర్యటించారు. వీధుల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజలతో మాట్లా డి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక నాయకు లు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేస్తూ ముందుకెళ్లారు. కాగా, ఎమ్మెల్యే బైక్‌పై కాలనీలకు రావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.