దళితబంధు దేశానికి ఆదర్శం
ముత్తారం సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య
ముత్తారం, ఆగస్టు 27: మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్ర భుత్వ పథకాలు పేదలకు అందుతాయని ము త్తారం ఎంపీపీ జక్కుల ముత్తయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నదని వివరించారు. వాటిని అర్హులకు చేరవేస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. దళితులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి అమలు చేస్తున్నారని వివరించారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలను అందజేస్తున్నారని తెలిపారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలువనుందని చెప్పారు. ఈ సందర్భంగా సభలో సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడుతూ, గత సర్యసభ్య సమావేశంలో గుర్తించిన సమస్యలను అధికారులు పరిష్కరించలేదని వివరించారు. దీంతో ఎంపీపీ మాట్లాడుతూ, అధికారులు ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చెలుకల స్వర్ణలతఅశోక్ యాదవ్, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ గుజ్జల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ సుదాటి రవీందర్రావు, ఎంపీటీసీలు అల్లం తిరుపతి, కిషన్రెడ్డి, బియ్యాని శ్యామలసదానందం, రామగళ్ల పోశమ్మమధుకర్, ఒద్దె తిరుమలతిరుమతి, కో-ఆప్షన్ సభ్యుడు హకీం, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నూనె కుమార్, సర్పంచులు సిరికొండ బక్కారావు, పులిపాక నగేశ్, సంపత్రావు, మహేందర్ యాదవ్, సతీశ్గౌడ్, ఉప్పు లక్ష్మి, పర్ష లక్ష్మి, అధికారులు రఫి, హన్నన్ తదితరులు పాల్గొన్నారు.