జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
రజకులకు ఉచిత విద్యుత్ మీటర్ల పంపిణీ
జగిత్యాల రూరల్, ఆగస్టు 26: రాష్ట్ర ప్రభు త్వం కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 41వ వార్డులో పలువురు రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ మీటర్ల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. లాండ్రీ షాపులో దుస్తులను ఎమ్మెల్యే ఇస్త్రీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల వారికి తగిన ప్రాధాన్యతను ఇస్తున్నదని పేర్కొన్నారు. కులవృత్తులను నమ్ముకున్న వారికి మరింత ఆస రా కల్పించడానికి సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వలస లు, ఆత్మహత్యలు తగ్గాయన్నారు. జిల్లాలో దాదా పు 800మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. జగిత్యాలలో 50లాండ్రీ షాపులను గుర్తించారని, ఇంకా అర్హులుంటే గుర్తించాల ని అధికారులను ఆదేశించారు. మొన్నటి వర్షాలకు గంగపుత్రులు నష్టపోయారని జగిత్యాలకు చెంది న ఓ నేత లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నా రు. కొన్ని చేపలు పోయిన మాట వాస్తవమేనని, ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేయడంతో గంగపుత్రులు ఆర్థికంగా ఉపాధి పొందుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తుల అభివృద్ధికి ఎవరైనా ఆలోచించారా అని విమర్శించారు. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన కేసీఆర్, సహకరించిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఈశ్వర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్, బొడ్ల జగదీశ్, మేక పద్మావతి పంబాల రామ్‌కుమార్, ముస్కు నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, రజక సంఘం పట్టణాధ్యక్షుడు గొల్లపల్లి లింగం, జిల్లా, మండ లాధ్యక్షులు మర్రిపెల్లి నారాయణ, పోచా లు, నేతలు మేక పవన్, మల్లేశ్, రాజేందర్, దేవ య్య, తిరుపతి, శివ, విజయ్, ఎఫ్‌సీఎస్ డైరెక్టర్ ఆరుముళ్ల పవన్, సోషల్ వెల్ఫేర్ అధికారి సాయిబాబా, ఏడీఈ జవహర్‌నాయక్ పాల్గొన్నారు.