సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Mar 01, 2020 , 02:24:54

మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ ఆరోగ్యం

 మహిళల ఆరోగ్యంతోనే కుటుంబ ఆరోగ్యం

కరీంనగర్‌ హెల్త్‌ : మహిళల ఆరోగ్యంతోనే కుటుం బం ఆరోగ్యంగా ఉంటుందనే నినాదంతో ఈ యే డు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచనతో వెళ్తున్నామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మహిళా విభాగం అధ్యక్షురా లు డాక్టర్‌ విజయలక్ష్మి అన్నారు. శనివారం కరీంనగర్‌లోని ఐఎంఏ హాల్‌లో విలేకరులతో మా ట్లాడారు. ఆడ పిల్లలను రక్షించుకుని ఆహారం, విద్య, వికాసం, అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. మహిళ లేనిదే సృష్టి లేద న్నారు.  మహిళా దినోత్సవాన్ని పురస్కిరంచుకుని వారం  పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.   మార్చి 1న ఉదయం 7 గంటలకు తెలంగాణ చౌక్‌ జెండా పాయింట్‌ నుంచి ఐఎంఏ హాల్‌ వరకు వాక్‌ టాన్‌ ఉంటుందని ఈ కార్యక్రమానికి కార్పొరేషన్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, డీఎంహెచ్‌ఓ సుజాత  హాజరవుతారని తె లిపారు.   3న ఉదయం 10 నుంచి 12  వరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు హెల్త్‌ క్యాంపు ఉంటుందన్నారు.  5న సాయం త్రం 3 నుంచి 5  వరకు పట్టణ మహిళలకు వైద్య శిబిరంతో పాటు వివిధ రకాల వ్యాధుల సంక్రమణంపై అవగాహన ఉంటుందన్నారు. 8న ప్రపంచ మహిళా దినోత్సవం రోజు సాయంత్రం 7.30 గంటలకు వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.  వైద్యులతో పాటు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షు డు డాక్టర్‌ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.  సమావేశంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు వసంత్‌రావు, అధ్యక్షుడు మాధ వి పొలాస, పద్మప్రియ, పోలాస రాంకిరణ్‌, అలీం, ఝాన్సీ, శేష శైలజ, మేఘన, జ్యోతి పాల్గొన్నారు


logo