శనివారం 06 జూన్ 2020
Karimnagar - Feb 01, 2020 , 03:56:13

ప్రధానమంత్రి మాన్‌ ధన్‌ యోజనపై అవగాహన

 ప్రధానమంత్రి మాన్‌ ధన్‌ యోజనపై అవగాహన

చొప్పదండి, నమస్తేతెలంగాణ: చిట్యాలపల్లిలో ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ ధన్‌ యోజనపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన  వ్యవసాయాధికారి వంశీ మాట్లాడుతూ రైతులకు పలు సూచనలు చేశారు. 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండి, ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులు కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయసును బట్టి రూ.55 నుంచి రూ.200 వరకు నెల వారీగా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో ప్రీమియం చెల్లించాలని సూచించారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు 60 ఏళ్ల తర్వాత రూ.3 వేలు పింఛన్‌ వస్తుందని పేర్కొన్నారు.  సర్పంచ్‌ గుడిపాక సురేశ్‌, మాజీ సర్పంచ్‌ వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈవో ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు. 

కరీంనగర్‌ రూరల్‌: ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ ధన్‌ యోజనలో భాగంగా  ఇచ్చే పింఛన్‌ను సద్వినియోగం చేసుకోవాలని  వ్యవసాయాధికారి సత్యం రైతులకు సూచించారు. గోపాల్‌పూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రధానమంత్రి మాన్‌ ధన్‌ యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్‌ ఊరడి మంజుల, ఉపసర్పంచ్‌ ఆరె శ్రీకాంత్‌, రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్‌ మేడిద రాజిరెడ్డి, జిల్లా సభ్యుడు తిరుపతి, ఏఈవో స్వర్ణలత, మల్లారెడ్డి, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. 


logo