ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత నేత
దళితబంధు దేశానికే ఆదర్శం
పార్టీ శ్రేణులు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య
కమాన్‌పూర్, సెప్టెంబర్ 5: కార్యకర్తలే టీఆర్ఎస్కు పట్టుగొమ్మలు..వారు లేనిదే నాయకులకు మనుగడ లేదు’ అంటూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి బస్వరాజు సారయ్య వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలను గడగడపకూ తీసుకెళ్లి.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కష్టపడ్డ వారికే కమిటీల్లో ప్రాధాన్యం దక్కుతుందని ప్రకటించారు. కమాన్‌పూర్ మండలం జూలపల్లి హనుమాన్‌నగర్‌లో ఆదివారం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను నిర్వహించగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్నివర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర పథకాలను ఉదహరించారు. దళితుల తలరాత మార్చేందుకు తెచ్చిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు వారి కుయుక్తులను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీ పటిష్టానికి కృషి చేయాలని నిర్దేశించారు. ఎదేని కారణంగా మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచేందుకు రూ. 2లక్షల ప్రమాద బీమాను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజత మనిషి అయిన పుట్ట మధు మంథని నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమన్నారు.
కార్యకర్తలకు రుణపడి ఉంటా: పుట్ట మధు
అడుగడుగునా తన వెన్నంటి ఉంటూ తన అభ్యున్నతికి కృషి చేస్తున్న కార్యకర్తలకు రుణపడి ఉంటానని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. కమాన్‌పూ ర్ మండల ప్రజల ఆశీర్వాదంతోనే జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యాయని ఉద్ఘాటించారు. జిల్లా ప్రజల అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని చెప్పారు. త్వరలో అంగన్వాడీ కేంద్రాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
గ్రామ శాఖ అధ్యక్షులకు సత్కారం
టీఆర్ఎస్ గ్రామ శాఖ, యూత్‌తో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులకు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్మన్ పుట్ట మధు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, ఎంపీపీ రాచకొండ లక్ష్మి, వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్‌రావు, కో ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, సర్పంచులు బొల్లపెల్లి శంకర్‌గౌడ్, కొండ వెంకటేశ్, తాటికొండ శంకర్, ఇటవేన కొమురయ్య, అబ్బిడి వినోద, గొడిసెల ఉమాసంపత్, నాయకులు ఇనగంటి రామారావు, గడప కృష్ణమూర్తి, గుర్రం లక్ష్మిమల్లు, పొనగంటి కనకయ్య, పోలుదాసరి సాయికుమార్, సుతారి రాజేందర్, మేకల సంపత్ యాదవ్, అనవేన భూమయ్య, వేణు, ఎండి కలీమోద్దీన్, పెండ్లి నారాయణ, దండె కిషన్, కొయ్యడ రవి, దీకొండ కొమురయ్య, ఎద్దు రాజయ్య, చిగురు భూమ య్య, కుందారపు సత్యనారాయణ, పోలుదాసరి సాయికుమార్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.