రాష్ట ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ
కొడిమ్యాల, సెప్టెంబర్ 2: పిల్లలకు ఆహార భద్రత మనం దరి బాధ్యతని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి అన్నారు. అలాగే ఆహార భద్రత కార్డులను అర్హులకు అందేలా చూడాలని అన్నారు. నల్లగొండ గ్రామంలో అంగన్వాడీ కేంద్రా న్ని, కొడిమ్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హైస్కూల్, రేషన్ షాపును ఫుడ్ కమిషన్ సభ్యురాలు భారతితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆంగన్వాడీ కేంద్రంలో బా లింతలు, గర్భిణులకు సరుకులు అందుతున్నాయా..? లేదా..? అని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పిల్లలకు మెనూ ప్రకారం సరుకులు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాపులో మెనూను పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అంగన్వాడీ కేంద్రాలు, బియ్యం గోదాంల పరిశీలన
మండలంలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు, ఎంఎల్ఎస్ బి య్యం గోదాంల పరిశీలన, రేషన్‌షాపుల పనితీరుపై రాష్ట్ర పుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డితోపాటు సభ్యురాలు భారతి క్షేత్రస్థాయిలో సందర్శించి, పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముత్యంపేట గ్రామపంచాయతీ పరిధిలో గల అంగన్వాడీ-2వ కేంద్రాన్ని సందర్శించడంతో పాటు పిల్లల వివరాలు, గర్భిణుల సంఖ్య, పోషకాహార పంపిణీ, నిల్వల వివరాలను అంగన్వాడీ టీచర్ గంగను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించడంతో పాటు సర్పంచ్ తిరుపతిరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ నరేశ్‌కు పలు సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల వారీగా గర్భిణుల సంఖ్య, బాలింతల సంఖ్య, చిన్నారుల వివరాలను ప్రతినెలా గ్రామపంచాయతీలో పబ్లిక్ నోటీస్‌పై ప్రదర్శించేలా చొరవ చూపాలని సూచించారు. అనంతరం మల్యాల మార్కెట్‌యార్డులో గల ఎంఎల్ఎస్ బియ్యం గోదాంలను పరిశీలించారు.
గోదాంలో పట్టుబడ్డ బియ్యం సంచులు వేరుగా కనిపించడంతో వాటి వివరాలను, కేసుల సంఖ్యను సివిల్ సప్ల య్ డీఎం రజినికాంత్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వరి పంట ఉత్పత్తి, జిల్లాకు రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం ఎంత పరిమాణంలో ఉందో అడిగి తెలుసుకున్నారు. గోదాంలో పనిచేసే హమాలీలకు గ్రాప్ ఇన్సూరెన్స్ చేసారా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలకేంద్రంలో గల అన్నపూర్ణ కో ఆపరేటివ్ సూపర్‌బజార్ చెందిన రేషన్‌షాపును పరిశీలించారు. షాపులోని కార్డులసంఖ్య, తూకం వివరాలు, నిల్వలు, యూనిట్ల సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట డీఆర్డీఏ వినోద్‌కుమార్, సివిల్ సప్లయ్ డీఎస్వో చందన్‌కుమార్, డీఈవో జగన్మోహన్రెడ్డి, జగిత్యాల ఆర్డీవో మాధురి, మల్యాల తహసీల్దార్ సుజాత, ఇన్చార్జి సీడీపీవో మమత, సూపర్వైజర్ రాజశ్రీ, నాయబ్ తహసీల్దార్ కృష్ణ, ఆర్ఐ అనూప్‌కుమార్, అంగన్వాడీ టీచర్ గంగ, రేషన్ డీలర్ మహేశ్, కొడిమ్యాల డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో పద్మజ, వైద్యుడు శ్రీనివాస్, సర్పంచ్ పిల్లి మల్లేశం, ఏలేటి మమత, ఐసీడీస్ సూపర్వైజర్ శ్రీలత, తదితరులున్నారు.
కొండగుట్టులో పూజలు
మల్యాల, సెప్టెంబర్ 2: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి, సభ్యురాలు భారతి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు వీరికి స్వాగతం పలుకడంతో పాటు వారి చేత స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేయగా, అర్చకులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకుడు శ్రీనివాసశర్మ, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్‌రావు, ఉప ప్రధానార్చకుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.