పర్యావరణ హిత పనులు
ఆగస్టులో 39 శాతం బొగ్గు ఉత్పత్తి
ఆర్జీ-1 జీఎం నారాయణ
గోదావరిఖని, సెప్టెంబర్ 2: ఆర్జీ-1 పరిధిలో జీడీకే 5గని స్థానంలో ఓసీపీ-5 పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు జీఎం కల్వల నారాయణ తెలిపారు. జీఎం కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. 2.30 కిలోమీటర్ల మేరకు దుమ్ము, ధూళి పడకుండా, పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మొక్కలు నాటుతామని తెలిపారు. కార్మికులకు గోదావరి నుంచి శుద్ధమైన నీటిని సరఫరా చేసేందుకు ఇప్పుడు ఉన్న ఫిల్టర్‌బెడ్‌కు అదనంగా మరో రెండు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. రూ. 20కోట్లతో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆర్జీ-1లో ఆగస్టులో 39 శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందని వివరించారు. ఐదు నెలల్లో ఆర్జీ-1లో 11,58,700 టన్నులకు గానూ 8,67, 350 టన్నుల బొగ్గు ఉత్పత్తి అయిందని తెలిపారు. మేడిపల్లి ఓసీపీలో బొగ్గు నిల్వలు అడుగంటడంతో ఆగస్టులో 23శాతం ఉత్పత్తి అయిందని వివరించారు. సమావేశంలో అధికారులు రామకృష్ణ, రామ్మూర్తి, సీహెచ్ శ్రీనివాస్, కేవీ రావు, లక్ష్మీనారాయణ, నవీన్, మదన్మోహన్, సారంగపాణి, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
కార్మికులకు బహుమతులు
మేడిపల్లి ఓసీపీకి 2020-21కుగానూ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతను సాధించడంతో యాజమాన్యం ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ కింద బహుమతులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై 364 మంది ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ఈ సం దర్భంగా జీఎం మాట్లాడారు. ఓసీపీలో అంకిత భావంతో బొగ్గు ఉత్పత్తి సాధించిన ప్రతి ఉద్యోగిని అభినందించారు. ఇక్కడ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు, పీవో సత్యనారాయణ, సీఎంవోఐఏ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రాజెక్టు ఇంజినీర్ ఎన్వీ రావు, మేనేజర్ గోవిందరావు, పిట్ సెక్రటరీ రాజిరెడ్డి, జీఎం కమిటీ మెంబర్ గంగాధర్, సంక్షేమాధికారి ఫిరోజ్‌ఖాన్ ఉన్నారు.