రాష్ట్ర ప్రభుత్వం బీసీ చేతి వృత్తుల చేయూత పథకం ద్వారా కులవృత్తిదారులకు ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్నది. అందులో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో శుక్రవారం ఒకే రోజు 705 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున అందించి వారిలో భరోసా నింపింది. కరీంనగర్‌లోని పద్మనాయక ఫంక్షన్హాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ చెక్కులు పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోయారు. చెక్కులను తమ కండ్లకు అద్దుకొని సంబురాలు చేసుకున్నారు. తమ వృత్తులకు పునర్జీవం పోసేందుకు ఆర్థిక సాయం అందించిన సీఎం కేసీఆర్ దేవుడని కొనియాడారు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. పని చేసే ప్రభుత్వానికి అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు.
వృత్తి పని వారి గౌరవం పెంచిన్రు
గతంలో ఏ నాయకుడు కూడా కుల వృత్తుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం కుల వృత్తులను ప్రోత్సహించాలని లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం తీసుకువచ్చిన్రు. కుల వృత్తి అంటేనే చిన్నచూపు చూస్తున్న ఈ సమయంలో ఈ పథకంతో మాలాంటి వారికి గౌరవం పెంచిన్రు. ఇంత మంచి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదు. అన్ని వృత్తులను ప్రోత్సహించి కాపాడుతున్న గొప్ప వ్యక్తి. ఇలాంటి నాయకులకు అండగా ఉండి ముందుకు నడుస్తాం. వచ్చే ఎన్నికల్లోనూ తప్పకుండా వీరినే ఎన్నుకుంటం.
– తిప్పారపు శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ, 12వ డివిజన్ కరీంనగర్,
మా కష్టాలు తీరుతయ్
సర్కారు అందిస్తున్న లక్ష రూపాయల సాయంతో మా కష్టాలు తీరుతయ్. కొత్త యంత్రాలను కొనుక్కుంటం. చేతితో చేయాల్సిన పనులను యంత్రాలతో చేస్తాం. దీంతో వేగంగా పని పూర్తి చేసి మరింత ఎక్కువగా సంపాదిస్తాం. ఇప్పటి వరకు చేతులతో పని చేయడంతో ఆదాయం తక్కువగానే వస్తంది. ఇప్పుడు యంత్రం వస్తే ఆ కష్టాలు ఉండవు. మాలాంటి వృత్తులను కూడా ఆదుకోవాలన్న ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ సార్‌కు వందనాలు. ఇలాంటి ఆలోచనలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. ఇంత మంచి ముఖ్యమంత్రి ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి వారితోనే మేం ఉంటాం. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్నే ఎన్నుకుంటం.
గతంలో గిట్ల ఎవరూ పట్టించుకోలె
చేతి వృత్తి చేసుకునే మాలాంటి వారి కష్టాలను సీఎం కేసీఆర్ సార్ గుర్తించిన్రు. గతంలోని ఏ ప్రభుత్వాలు కూడా గిట్ల మా గురించి పట్టించుకోలె. అప్పుడు లోన్లు ఇచ్చినా వాటి కోసం ఏవేవో అడ్డంకులు పెట్టెటోళ్లు. మళ్లీ కిస్తీలు కట్టించుకునెటోళ్లు. కానీ, సీఎం కేసీఆర్ సార్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా మళ్లీ రూపాయి కట్టేది లేకుండా లక్ష రూపాయలు ఇస్తున్నడు. గిట్ల ఇచ్చుడు చాలా గొప్ప విషయం. ఇలాంటి ప్రభుత్వానికి మేం ఎప్పటికీ రుణపడి ఉంటం. ఇలాంటి నాయకులు నిండు నూరేళ్లు జీవించాలె.
– నెల్లుట్ల భాగ్య, కుమ్మరి, మారుతీనగర్
షాపును అభివృద్ధి చేసుకుంట
ప్రభుత్వం అందించిన లక్ష రూపాయల సాయంతో నా షాపును అభివృద్ధి చేసుకుంట. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇప్పుడున్న సేవలను మరింత మెరుగ్గా అందిస్త. ఇన్నాళ్లూ ఈ వస్తువులు కొనేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ దేవుడిలా లక్ష రూపాయల సాయం చేసిన్రు. మళ్లీ కట్టాల్సిన అవసరం లేకుండా చేసిండు. వచ్చిన డబ్బును షాపును అభ్యున్నతిలోకి తీసుకు వచ్చేందుకు వాడుకుంటం. ఇంత మంచి పథకం తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటం. గతంలో ప్రభుత్వాలు ఏవో పథకాలు తెచ్చినా బ్యాంకుల చుట్టూ తిరగడమే తప్ప రూపాయి వచ్చింది లేదు. కానీ, ఇప్పుడు ఎక్కడా తిరగకుండానే లక్ష రూపాయలు ఇచ్చిన్రు.
– నీలికొండ పద్మ, నాయీబ్రాహ్మణ, జ్యోతినగర్, కరీంనగర్
ఇబ్బందులు తొలుగుతున్నయ్
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం మాలాంటి కుల వృత్తులు చేసుకునే వారికి ఆదాయాన్ని పెంచడమే కాకుండా కుటుంబ అభ్యున్నతికి ఉపయోగపడుతుంది. ఇన్ని రోజులు కుల వృత్తి చేసుకుంటే ఏం సంపాదిస్తవ్ అనేటోళ్లు. ఇప్పుడు అలా అనకుండా ఆత్మగౌరవంగా పని చేసుకునే విధంగా సీఎం కేసీఆర్ సార్ ప్రోత్సహిస్తున్నరు. ధోబీఘాట్లను అభివృద్ధి చేస్తుండడంతో వృత్తి పనిల మాకు ఇబ్బందులు తొలిగి పోతున్నయ్.
– నేరెళ్ల మహేశ్, రజక, 55వ డివిజన్, కరీంనగర్
ఆదాయం పెంచుకుంటా
ప్రభుత్వం ఇస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సాయంతో నేను చేస్తున్న వృత్తిలో ఆదాయం పెంచుకునేలా కొత్త యంత్రాలను కొనుక్కుని పని పెంచుకుంటా. వృత్తిని కాపాడుకునే విధంగా సీఎం కేసీఆర్ అందిస్తున్న ఈ సహాయం ప్రోత్సాహకంగా ఉంటుంది. మళ్లీ ఈ డబ్బులు కట్టే అవసరం కూడా లేదు. వచ్చిన నగదును మా పనిని పెంచుకునేందుకే ఖర్చు చేస్తాం. చేతివృత్తులు చేసుకుంటున్న మమ్ముల్ని ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పటికీ తోడుగా ఉంటాం. ఆయనే మళ్లీ సీఎం కావాలి.
– పాలోజు కరుణాకర్, కమ్మరి, ఆసిఫ్‌నగర్
మళ్లీ వృత్తి పని చేసుకుంటరు
ఇన్నాళ్లుగా మా వృత్తి పని చేయడానికి ముందుకు వచ్చేవారు ఉండకపోయేది. కానీ, సీఎం కేసీఆర్ సార్ కుల వృత్తులను కాపాడేందుకు తీసుకువస్తున్న పథకాలతో మళ్లీ మంచి రోజులు వచ్చాయి. మళ్లీ వృత్తి పని చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నరు. మారుతున్న కాలంలో వస్తున్న మార్పులతో పనులు కూడా ఉండడం లేదు. కానీ, సర్కారు చేయూత పథకం ద్వారా అందిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సాయంతో కొత్త యంత్రాలను కొనుగోలు చేసుకొని వృత్తి పని చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇలాంటి పథకాలను తీసుకువస్తున్న ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. వారిని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకుంటాం.
– పాలోజు సురేశ్, కమ్మరి, ఆసిఫ్‌నగర్
వృత్తిని కాపాడుకుంటం
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం మాకు చాలా ఉపయోగపడుతుంది. సాంకేతికపరంగా వృత్తి అవసరాల కోసం కొత్త యంత్రాలు కొనాలంటే మాలాంటి వాళ్లకు ఆర్థికంగా భారమే. కొత్త యంత్రాలు వచ్చినంక వేగంగా పని అవుతుంది. అయితే, మా దగ్గర అలాంటివి లేకపో వడంతో కస్టమర్స్ కూడా రావడం లేదు. ఆ యం త్రాలను కొనే స్థోమత లేక ఇబ్బంది పడుతున్న మాకు సర్కారు ఇచ్చే రూ.లక్ష సాయంతో కొనుగోలు చేస్తాం. మా వృత్తిని కాపాడుకుంటం. ఈసాయం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌ను ఎప్పటికీ మరిచిపోం.
– తిప్పర్తి రవికిరణ్ విశ్వబ్రాహ్మణ, చామనపల్లి
కుల వృత్తులను ఆదుకుంటున్నరు
ప్రస్తుత సమాజంలో వస్తున్న ఆధునిక యంత్రాల కారణంగా మాకు వృత్తి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. పెద్ద పెద్ద యంత్రాలను కొనుగోలు చేసే శక్తి లేక మేం వృత్తిని విడిచిపెట్టే పరిస్థితులు వచ్చాయి. కానీ, సీఎం కేసీఆర్ సార్ మా ఇబ్బందులను గుర్తించి ఈ వృత్తులను కాపాడేందుకు ఈ చేయూత పథకం తీసుకురావడం సంతోషంగా ఉంది. మరోవైపు రజకులకు అనేక తీరుగ పథకాలు పెట్టి ఆదుకుంటున్నడు. దీని వల్ల మా వృత్తిని కొనసాగించే అవకాశం వచ్చింది. అలాగే ధోబిఘాట్లను కొత్తగా కడుతున్నరు. ఇలాంటి ముఖ్యమంత్రి మరింత కాలం ఉండాలి.
– నేరెళ్ల ఆంజనేయులు, రజక, బొమ్మకల్
సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం
మా అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు తీసుకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే మేం ఉం టాం. గతంలో పాలకులు ఎవరు కూడా మా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ, సీఎం కేసీఆర్ అందరి బాధలను తెలుసుకొని వాటిని తీర్చేలా పథ కాలను అమలు చేస్తున్న రు. రజక వృత్తిని కాపా డుకునే విధంగా కరెంటు చార్జీల్లో కానీ, ధోబీ ఘాట్ల అభివృద్ధిలో కానీ అన్ని విధాలుగా మాకు అండగా నిలుస్తున్నరు. అలాంటి సార్‌కు మేము కూడా తోడుగానే ఉంటాం. కులవృత్తులను గౌరవంగా చేసుకునేలా పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ఎప్పటికీ చల్లగా ఉండాలి.
– మొగిలి రాజు, రజక, ఆసిఫ్‌నగర్
మాలాంటోళ్లకు ఎంతో ఆసరా
సర్కారు అందిస్తున్న లక్ష రూ పాయల సాయం మాలాంటి కుల వృత్తి వారికి ఎంతో ఆసరగా ఉంటయ్. మార్కెట్లో వచ్చిన పెద్ద కంపెనీల వల్ల మేం కుల వృత్తి చేసుకు నేందుకు ఇబ్బందులు పడు తున్నాం. ఇలాంటి స మయంల సీఎం కేసీఆర్ గొప్ప పథకాన్ని తీసు కు వచ్చిన్రు. వారిచ్చే సా యం తో కొత్త యంత్రాలు కొను క్కోవచ్చు. గతంలో ప్రభు త్వాలు బ్యాంకు రుణాల పేరుతో తిప్పడమే తప్ప ఇచ్చింది లేదు. కానీ, కేసీఆర్ మాత్రం ఎక్కడా తిరిగే పని లేకుండా సాయం చేసిన్రు. ఇలాంటి నాయకులు మరింత కాలం ఉండాలి.
– ఉదారం సత్తయ్య, విశ్వబ్రాహ్మణ, సుభాష్‌నగర్, కరీంనగర్