మంగళవారం 07 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 09, 2020 , 02:23:18

రాజకీయాల్లో మార్పుతో మహిళలకు స్వేచ్ఛ

రాజకీయాల్లో మార్పుతో మహిళలకు స్వేచ్ఛ

ములుగుటౌన్‌ : సమాజంలో రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పులతో మహిళలకు స్వేచ్ఛ లభించిందని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పీఆర్టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులను మహిళా రాజకీయ నాయకులను ఘనంగా సన్మానించారు. ముఖ్యఅథితిగా హాజరైన శ్రీదేవి సుధీర్‌ మాట్లాడుతూ మహిళ అంటే అబల కాదు.. సబల అని అన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో వంద సంవత్సరాల క్రితం జరిగిన మహిళా ఉద్యమ ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నారు. అనంతరం ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షించారు. జెడ్పీసీఈవో పారిజాతం పాల్గొన్నారు. అలాగే జీపీలో జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా సర్పంచ్‌ బండారి నిర్మలహరినాథం మాట్లాడారు. అలాగే రైతులు కూలీ సంఘం ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ప్రసాద్‌, ప్రగతి శీల మహిళ సంఘం, స్త్రీ సంఘటన నాయకులు అరుణ, మంజుల, అరుణోదయ సాంస్కృత సభ్యులు పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. 


logo