మంగళవారం 31 మార్చి 2020
Jayashankar - Feb 02, 2020 , 02:05:44

ఆర్టీసీ గణాంక విభాగాన్ని పరిశీలించిన ఆర్‌ఎం, డీఎంలు

ఆర్టీసీ గణాంక విభాగాన్ని పరిశీలించిన ఆర్‌ఎం, డీఎంలు

ఏటూరునాగారం/తాడ్వాయి, ఫిబ్రవరి 1 : ఆర్టీసి ఆధ్వర్యంలో తాడ్వాయి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రయాణికుల గ ణాంక విభాగాన్ని ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీధర్‌, వరంగల్‌-2 డిపో మేనేజర్‌ భానుకిరణ్‌ శనివారం సందర్శించారు. జాతరకు ఆర్టీసీ బస్సు ల్లో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే సంఖ్యను తెలుసుకునేందుకు ఇక్కడ ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. గతంలో రోడ్డుపైనే బస్సులను ఆపి ప్రయాణికుల సంఖ్యను తెలుసుకునే వారు. కాగా, ఈసారి మాత్రం ప్రధాన రోడ్డు పక్కనే మరో మట్టి రోడ్డుకు కొద్దిగా ఏర్పాటు చేశారు. గణాంక సెంటర్‌కు చేరుకునే బస్సులు పక్క రోడ్డుపైకి వచ్చి సంఖ్యను చెప్పగానే అక్కడ పనిచేసే అధికారులు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నందున తాడ్వాయి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను ఆర్‌ఎం శ్రీధర్‌, డీఎం భానుకిరణ్‌ సందర్శించి, సిబ్బందితో మాట్లాడారు. ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. వారంతా విధుల్లోకి చేరారు. నిత్యం బస్సుల్లో వచ్చే వారి సంఖ్యను నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వారి వెంట సెక్యూరిటీ ఇన్‌చార్జి బాబురావు తదితరులు ఉన్నారు.


logo
>>>>>>