e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జనగాం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

పరకాల, ఏప్రిల్‌ 16 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో నిర్వహించిన రైతు మహాగర్జన సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టాలు రైతులకు తీవ్ర నష్టాలు కలిగిస్తాయని, మరోవైపు వ్యవసాయం కార్పొరేట్‌ చేతుల్లోకి వెళ్లి చిన్న, సన్నకారు రైతులు నష్టపోతారని ఆరోపించారు. పేదలకు నష్టం వాటిల్లే వ్యవసాయ, విద్యుత్‌ సవరణ చట్టాలను వెంటనే ఉప సంహరించుకోవాలన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఈ నెల 23వ తేదీన కరీంనగర్‌ జిల్లాలో అన్ని పార్టీలు, ప్రజా, రైతు సంఘాల భాగస్వామ్యంతో రైతు మహా గర్జన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఓసీ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కొలుగూరి రాజేశ్వర్‌రావు, భూపాలపల్లి జిల్లా కన్వీనర్‌ లెంకల శ్రీనివాస్‌ రెడ్డి, నాయకులు మాడుగుల పాపిరెడ్డి, బిల్లా సత్యనారాయణరెడ్డి, చాడ రవీందర్‌రెడ్డి, ఎర్రం సదాశివ శంకర్‌, లింగంపల్లి రామారావు, చల్లా గోపాల్‌రెడ్డి, గంగాధర్‌రావు, కాల్వ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

చావు క‌బురు చ‌ల్ల‌గా రీఎడిటింగ్‌..ఎందుకంటే..?

చౌక వ‌డ్డీకే బంగారం లోన్‌.. ఈ బ్యాంకుల్లోనే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ట్రెండింగ్‌

Advertisement