సోమవారం 08 మార్చి 2021
Jangaon - Nov 13, 2020 , 06:11:44

రెండు లారీలు ఢీ.. తప్పిన ప్రమాదం

రెండు లారీలు ఢీ.. తప్పిన ప్రమాదం

జనగామ క్రైం: జనగామ-హైదరాబాద్‌ మార్గంలోని పెంబర్తి హైవేపై గురువారం సాయంత్రం రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.  వివరాలు ఇలా ఉన్నాయి.. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఇండియన్‌ గ్యాస్‌ సిలిండర్ల లారీ డ్రైవర్‌ ఢీ కొట్టాడు. ఈ ఘటనలో గ్యాస్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై రాజేశ్‌నాయక్‌  ఘటనా స్థలానికి చేరుకొని రెండు లారీల మధ్య ఇరుక్కు పోయిన డ్రైవర్‌ని బయటకి తీసి చికిత్స కోసం జనగామ ప్రభుత్వ ఏరియా దవాఖానకి తరలించారు. ఇసుక లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


VIDEOS

logo