బుధవారం 23 సెప్టెంబర్ 2020
Jagityal - Jun 05, 2020 , 03:54:07

గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసమే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసమే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

  • మొదటి, రెండో విడుత పల్లెప్రగతితో సమూల మార్పులు
  • కరోనా నిరోధంలోనూ కీలకం
  • ప్రతినెలా 330 కోట్ల వ్యయంతో కొత్తరూపు
  • ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి 
  • ‘నమస్తే’తో రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వికలాంగ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకుపచ్చని, ఆరోగ్య తెలంగాణయే లక్ష్యంగా పనిచేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కొనియాడారు. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి సూచనలతో మహత్తర ‘పల్లెప్రగతి’కి శ్రీకారం చుట్టి, దశాబ్దాలుగా చీకట్లో మగ్గిన గ్రామాల్లో వెలుగులు నింపారని వివరించారు. మొదటి, రెండో విడుతల్లో గ్రామాల్లో గణనీయమైన ప్రగతి సాధ్యమైందన్న మంత్రి, ఇప్పుడు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంతో ఒక సమగ్ర రూపాన్ని సంతరించుకుంటాయని చెప్పారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంతో పాటు, జిల్లాలోని అన్ని గ్రామాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాయని చెప్పిన ఆయన, గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

- జగిత్యాల, నమస్తే తెలంగాణ 

నమస్తే: గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపు ఎలా ఉంది ?

కొప్పుల: గత ప్రభుత్వాలు పల్లెలను పట్టించుకున్నట్లు కనిపించలేదు. కేవలం పంచాయతీల నుంచి వచ్చే నిధులతోనే అభివృద్ధి కార్యక్రమా లు, చేపట్టేవారు. అయితే సీఎం కేసీఆర్‌ పల్లెల ప్రాధాన్యతను గుర్తించారు. అందుకే పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించి, జనాభా ఆధారంగా ప్రతి నెలా నిధులు కేటాయించే విధానాన్ని ఏర్పాటు చేశారు. దీంతో గ్రామాలకు నిధుల కొరత దూరమైంది. గ్రామంలో ఒకొక్క వ్యక్తికి సగటున నెలకు రూ.160 నుంచి రూ.168 చొప్పున నిధులు మంజూరు చేయబడుతున్నాయి. రాష్ట్ర ఫైనాన్స్‌ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులతో కలిపి జిల్లాకు దాదాపు నెలకు రూ.15 కోట్ల రూపాయల దాకా నిధులు మంజూరవుతున్నాయి. 

గత పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు, ప్రగతి ఏంటి ?

గత పల్లె ప్రగతిలో జిల్లాలో గొప్పగా కార్యక్రమాలు నిర్వహించాం. ప్రతి గ్రామంలోనూ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాం. గ్రామానికి ఒక ట్రాక్టర్‌ లేదా ట్రాలీని కొనుగోలు చేశాం. తడి, పొడి చెత్తను వేరు చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. అలాగే ప్రతి ఊరికి స్వాగత తోరణం ఏర్పాటు చేశాం. గ్రామాల పొలిమేర్లలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాం. సంరక్షిస్తున్నాం. అలాగే శిథిల భవనాలను నేలమట్టం చే శాం. కాలువలు శుద్ధి చేశాం. పాడుబడ్డ బావులను పూడ్చి, చదునుచేశాం. డంపింగ్‌ యార్డులు, నర్సరీలు ఏర్పాటు చేసుకున్నాం. జగిత్యాల జిల్లా లో 380 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేశాం. 

వైకుంఠధామాల నిర్మాణం, ఇతర నిర్వహణ చర్యలు ఎలా ఉన్నాయి ?

ప్రతి గ్రామానికి వైకుంఠధామం నిర్మిస్తున్నాం. ఇప్పటికే దాదాపు 250 గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. దాదాపు అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలకు నిధులు కేటాయించాం. ఉపాధిహామీ పథకం, పంచాయతీరాజ్‌, గ్రామ పంచాయతీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించాం. అందుబాటులో ప్రభుత్వ భూమి ఉంటే, వైకుంఠధామాల నిర్మాణానికి, నర్సరీల ఏర్పాటుకు కేటాయించాం. లేదంటే దాతల నుంచి సైతం స్వీ కరించి, నిర్మాణాలు చేపడుతున్నాం. అలాగే కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణం జరుగుతోంది. వీటికి గ్రా మపంచాయతీ ఆదాయంలో 10 శాతం కేటాయించాం. కార్మిక సిబ్బందినీ పెంచాం. ఊరికో పంచాయతీ కార్యదర్శి ఉండేలా చూస్తున్నాం. జిల్లాలో 13 గ్రామాల్లో తప్ప మిగిలిన అన్ని గ్రామాల్లో సెక్రటరీలు పనిచేస్తున్నారు. 

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ఎలా నడుస్తున్నది?

జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చురుగ్గా సా గుతున్నది. ఒకటో తేదీన గ్రామప్రజాప్రతినిధు లు, అధికారులు పల్లెల్లో పర్యటించి, సమస్యలను గుర్తించారు. అనంతరం చేపట్టాల్సిన పనులపై కా ర్యాచరణ రూపొందించారు. పట్టణాలు, గ్రామా ల్లో నీరు నిలువఉండే ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి,వాటిని శుద్ధి చేస్తున్నాం. అవసరమైన చోట గుంతలు పూడ్చివేస్తున్నాం. దోమల   నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. పారిశుధ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించి, క్లోరినేషన్‌ చేపడుతున్నాం. 

కరోనా నివారణ చర్యలు ఎలా ఉన్నాయి. ?

జిల్లాలో కరోనా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. నిజం చెప్పాలంటే సీఎం కేసీఆర్‌ ముందస్తుగా తీసుకున్న పల్లెప్రగతి కార్యక్రమం మనకు అధిక మేలు చేసింది. రెండు దఫాలుగా గ్రామాలను పరిశుభ్రం చేయడం, పరిసరాలను శుద్ధి చేయడంతో గ్రామాలు క్లీన్‌గా ఉన్నా యి. దీంతో వైరస్‌ జిల్లాలో పెద్దగా విజృంభించలేకపోయింది. జిల్లాలో పెద్దగా కేసులు నమోదు కాలేదు. మూడు కేసులు నమోదైనా, చికిత్సతో బయటపడ్డారు. అయితే ముంబైలో జిల్లాకు చెందిన వలస కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా స్వగ్రామాలకు తిరిగి రావడంతో 15 రోజులుగా వలస కూలీల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. అయితే వీరిని ముందుగానే ఐసోలేషన్‌, హోంక్వారంటైన్‌ చేస్తుండడంతో పెద్ద గా ఇబ్బంది రావడం లేదు. లాక్‌డౌన్‌ పూర్తిగా అమలు చేయడంతో జిల్లాపై కరోనా తీవ్రస్థాయి లో విరుచుకుపడకలేకపోయింది. వలస కూలీల కు సైతం మంచి వైద్యం అందుతోంది. వారు కూ డా ఆరోగ్యంతో తిరిగి వస్తారని భావిస్తున్నాం. 

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంపైప్రజల భాగస్వామ్యం ఎలా ఉన్నది?

ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదు. ఈ కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మొదటి, రెండో విడతలో పల్లె ప్రగతిలో ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వామ్యమయ్యారు. పలువురు దాతలు ముందుకు వచ్చి, వైకుంఠధామాలకు స్థలాలను అప్పగించడంతో పాటు, ఆర్థిక సాయం సైతం అందజేసి, పల్లె ప్రగతికి  అండగా నిలిచారు.

 సీజనల్‌ వ్యాధులు అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?

సీజనల్‌ వ్యాధులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నీరు మార్పిడి నేపథ్యంలో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టడానికి కా రణం అదే. ప్రతి గ్రామాన్ని శుద్ధి చేస్తున్నాం. ము రుగు కాలువలు శుభ్రం చేస్తున్నాం. ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపడుతున్నాం. అలాగే మెదడువాపు వ్యాధులకు కారణమయ్యే పందులను జనావాసాల నుంచి దూరంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వాటి పెంపకందారులకు ప్రత్యామ్నా య మార్గాలను చూపే విషయమై ఆలోచన చేస్తు న్నాం. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత పరిశుభ్రత గు రించి వివరించి, వారితోనే వారి గృహాలను శుద్ధి చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో దోమలు, క్రిమికీటకాల నివారణకు రసాయనాలను పిచికారీ చేయిస్తున్నాం. అలాగే అన్ని జీపీల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. దోమలు ప్రబ లి, జ్వరాలు వచ్చే అవకాశాలున్నాయని గుర్తిం చి, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, అలాగే, కమ్యునల్‌ ఆసుపత్రుల్లో మందులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

ప్రతి ఆదివారం పది నిమిషాల పరిశుభ్రత కార్యక్రమం ఎలా ఉన్నది?

మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు గొప్పది. ఆయ న ఉద్దేశం ఆరోగ్య తెలంగాణ సాధనే. అనారోగ్యం బారిన పడడానికి, విష జ్వరాలు రావడానికి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడమే. అలాగే ఇండ్ల లో మన నిర్లక్ష్యం మూలంగా పూలకుండీల నుం చి మొదలు కొని ఫ్రిజ్‌ వెనుకబాగం వరకు అన్ని చోట్ల నీరు నిల్వ ఉండిపోతుంది. ఆ నీటిని తొలగించని పక్షంలో క్రమంగా నీరు మురుగుగా మా రిపోయి, డెంగీ, మలేరియా దోమలకు జన్మకేంద్రంగా మారుతుంది. అందుకే ఇండ్లలో, వీధుల్లో నీరు నిల్వ ఉండడం మంచిది కాదు. ఈ విషయా న్ని గుర్తించి మంత్రి కేటీఆర్‌, ప్రతి ఆదివారం పది నిమిషాలు అన్న పిలుపునిచ్చారు. ఆయన పి లుపు స్ఫూర్తిగా పనిచేస్తున్నాం. ఈ విషయమై ప్ర జలకు సైతం అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏదీఏమైనా,ఆకుపచ్చని, ఆరోగ్యవంతమైన తెలంగాణసాధనే మా ధ్యేయం.logo