సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Mar 10, 2020 , 02:09:59

హోలీ.. ఆనందకేళి

హోలీ..  ఆనందకేళి

జగిత్యాల, నమస్తే తెలంగాణ: హోలీ పండుగ ఐక్యతకు చిహ్నం అని కలెక్టర్‌ జీ రవి పేర్కొన్నారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం, కలెక్టర్‌ కార్యాలయం, అదనపు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో హోలీ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రవి మాట్లాడుతూ తెలంగాణలో హోలీ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రసాయన రంగులు వాడవద్దని, సహజసిద్ధమైన రంగులు చల్లుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారంలో మరింత అత్యుత్తమ సేవలు అందించడానికి పునరాంకితం కావాలని అధికారులకు, ఉద్యోగులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అదనపు కలెక్టర్‌ బేతి రాజేశంను తాసిల్దార్లు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ వకీల్‌, హరి అశోక్‌ కుమార్‌, సీహెచ్‌ కృష్ణ, తిరుమల్‌ రావు, తాసిల్దార్లు మహేశ్‌, సత్యనారాయణ, దిలీప్‌ నాయక్‌,  సత్యనారాయణ, నాగేందర్‌ రెడ్డి, ఎలిగేటి రవీందర్‌, జీ విశ్వనాథం, విఠల్‌రావు, రాజు, రాజేంద్రప్రసాద్‌, రంగరావు, శంకర్‌, శ్యాం పాల్గొన్నారు. 

టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో...

జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో టీఎన్జీవోస్‌ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ రవికి రంగులు పూసి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు బోగ శశిధర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగులకు, అధికారులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ రవి సారధ్యంలో అన్ని శాఖల ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిస్వార్థంగా పనిచేసి జిల్లకు మంచి పేరు తేవాలని సూచించారు. కలెక్టర్‌ రవి మాట్లాడుతూ జిల్లా టీఎన్జీవోస్‌ సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలను సహజ రంగులతో జరుపుకోవాలని, ఉద్యోగులంతా జిల్లాకు మంచి పేరు తేవడానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.  ఆకుల సత్యం, నాగేందర్‌ రెడ్డి, రవీందర్‌, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


logo