ఆదివారం 29 మార్చి 2020
Jagityal - Feb 04, 2020 , 01:17:40

టార్గెట్‌ టాప్‌

టార్గెట్‌ టాప్‌

ధర్మపురి, నమస్తే తెలంగాణ: పదోతరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి వరుసగా పది ఫలితాల్లో జిల్లా మూడు సార్లు అగ్రగామిగా నిలిచి హ్యాట్రిక్‌ సాధించగా..అదే స్ఫూర్తితో నాల్గోసారి కూడా అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఫలితాల్లో జగిత్యాల జిల్లాను మరోమారు ప్రథమ స్థానంలో నిలిపేందుకు కలెక్టర్‌ శరత్‌ ‘విజయోత్తేజం’ పేరుతో అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే దృక్పథంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు వారికి అల్పాహారం అందిస్తున్నారు. మార్చి 19వ తేదీ నుంచి జరిగే వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. సిలబస్‌ ఇప్పటికే ముగించగా, ముఖ్యమైన విభాగాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి పాఠశాలలో ఉదయం 8.30నుంచి 9.30వరకు, సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వారంవారం పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

విజయోత్తేజం.. వంద శాతం ఫలితాలే లక్ష్యం

పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మరోమారు ప్రథమ స్థానంలో నిలిపేందుకు బదిలీ కలెక్టర్‌ శర త్‌ ప్రణాళిక రూపొందించారు. ఉత్తేజం కార్యక్రమంలో వరుసగా మూడుసార్లు ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపి ప్ర స్తుతం విజయోత్తేజం పేరుతో నాలుగోసారి అమ లు చేస్తున్నారు. నవంబర్‌ 26న విజయోత్తేజం కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, పాఠశాలల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తొమ్మిది మందితో ప్రత్యేక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. 100రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో భా గంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఏ,బీ, సీ,డీ లుగా విభజించి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారికి అల్పాహారం అందిస్తున్నారు.10మంది విద్యార్థులను ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి, వారి బాధ్యతలను ఒక ఉపాధ్యాయుడికి అప్పగించారు. ఏ సబ్జెక్టులో వె నుకబడి ఉన్నారో గుర్తించి ఉదయం, సాయంత్రం వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వేక ప్‌ కాల్‌ పేరిట ఉదయమే వారిని నిద్రలేపి పాఠశాలలకు రప్పించి ఉదయం 8.30గంటల నుంచి 9.30వరకు, సాయంత్రం 4.45గంటల నుంచి 5.45గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఏరోజుకారోజు స్లిప్‌ టెస్ట్‌లు పెడుతున్నారు. ఉదయం, సాయంత్రం పూట విద్యార్థుల కు అల్పాహారం కూడా అందిస్తున్నారు. ఆయా ప్రధానోపాధ్యాయులతో పాటు పంచాయతీ కార్యదర్శి, ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. 

పరీక్ష రాయనున్న 12,889 మంది

 జిల్లాలో 186 ప్రభుత్వ పాఠశాలలుండగా, 114 ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఇందులో 14 కస్తూర్బా పాఠశాలలు, 13 ఆదర్శ పాఠశాలలు, 10గురుకుల పాఠశాలలున్నాయి. 2019-20 విద్యా సంవత్సరంలో మొత్తం 12,889 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,356 మంది బాలికలు, 6,533 మంది బాలురున్నారు. 2016-17 విద్యాసంవత్సరంలో 97.35శాతం, 2017-18లో 97.56శాతం ఫలితాలు సాధించగా, 2018-19 సంవత్సరంలో 97.73శాతం ఫలితాలు సాధించి హ్యాట్రిక్‌ సాధించి సరికొత్త రికా ర్డు నమోదు చేసింది. దీంతో జగిత్యాలకు జాతీ య స్థాయిలో గుర్తింపు లభించింది. బదిలీ కలెక్టర్‌ శరత్‌ అవార్డునూ అందుకున్నారు. అదే స్ఫూర్తితో నాల్గోసారి కూడా జిల్లాను అగ్రగామి గా నిలపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

ఆందోళన వద్దు

గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం కఠినమైనవని పదేపదే భావిస్తూ ఆందోళన, గురి కావద్దని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. వాటిపై ఏకాగ్రత ఉంచి చక్కని ప్రణాళికతో కీలక భావనలు, ము ఖ్యాంశాలు చదువుతూ ఎక్కువ సమయం కేటాయిస్తూ కృషి చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చంటున్నారు. నెగెటివ్‌ ఆలోచనల ను, భయాన్ని మెదడులోకి చేరనీయవద్దంటున్నారు.


logo