మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Jan 31, 2020 , 00:48:17

జిల్లా ఆదర్శం కావాలి

జిల్లా ఆదర్శం కావాలి
  • రాష్ట్రంలో నంబర్‌ వన్‌గా నిలవాలి
  • ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండాలి
  • పదో తరగతి మరోసారి వందశాతం ఫలితాలు సాధించా లి
  • ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలి

జగిత్యాల, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ సంక్షే మ పథకాల అమలులో జగిత్యాల జిల్లా రాష్ర్టానికే ఆదర్శంగా నిలవాలనీ, అన్ని రంగాల్లో నంబర్‌ వ న్‌గా ఉండాలనీ, ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర ఎ స్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత అధ్యక్షతన  జిల్లా కేంద్రంలోని పద్మనాయక మినీ కల్యాణ మండలంలో గురువారం నిర్వహించిన జిల్లా పరిషత్‌ మూడో సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.    జిల్లాలో సమగ్ర కార్యాచరణ లేదనీ, సభ్యుల అసంతృప్తిని తెలుసుకొని అధికారులు సరిచేసుకోవాలని సూచించారు. సీ ఎం కేసీఆర్‌ ముందు చూపుతో ప్రజలందరికీ శుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో మిషన్‌భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారని, ఈ పనులు త్వ రగా పూర్తి చేయాలంటే కాంట్రాక్టర్లు సహకరిచడం లేదన్నారు. మున్ముందు ప్రతి మండలంలో ఎం పీపీ, జడ్పీటీసీ సభ్యులు, మండల ఇంజినీరింగ్‌ అధికారులు కలిసి మండలంలో రోజుకో గ్రామా న్ని పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని సూ చించారు. మిషన్‌ భగీరథ పనులు ఎలా ఉన్నా యో కూడా ప్రజలను అడిగి తెలుసుకోవాలని, పై పులైన్ల లీకేజీ, నల్లా కనెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకొని సమస్యలున్న చోట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. 


ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌, బీడీ కార్మిక పింఛన్లు సకాలంలో అందుతున్నాయా? లేదా తెలుసుకోలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెల అభివృద్ధి కో సం ‘పల్లె ప్రగతి’ని ఏర్పాటు చేశారని, దీంతో పల్లెలన్నీ అభివృద్ధి బాట పట్టాయన్నారు. వైద్యరంగం లో జిల్లాలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మండలాల్లోని పీహెచ్‌సీల్లో వైద్యుల హాజరు శా తం సరిగా లేదని, ఈ విషయంలో జిల్లా వైద్యాధికారి ప్రత్యేక చొరవ తీసుకుని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నా రు. సాంకేతిక కారణాలతో పనులు ఆగితే వాటిని పరిష్కరించాలని, మన జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా మారాలని, ఇప్పటికే 20 అంశాల్లో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రజల కు మెరుగై పాలన అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు జట్టుగా ఏర్పడి పనిచేయాలన్నా రు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడు తూ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.  ప లు మండలాల్లో పర్యటించిన సమయాల్లో పీహెచ్‌సీల్లో కింది స్థాయి సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారని, ఇక ముందు ఇలా జరగకుండా చూ డాలన్నారు.  


జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. మూడేళ్లుగా ప దో తరగతిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థా నంలో నిలిచిందని, ఈ ఏడాది కూడా మరోమా రు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాధికారులు కృషి చేయాలని కోరారు. కోరుట్ల ఎమ్మె ల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పనులు త్వరగా పూర్తిచేయాలని, ప్రతి ఇంటికీ నల్లా బిగించి శుద్ధ్దమైన నీటిని అం దించాలన్నారు. ఆసియాలో అతిపెద్దదైన సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో మొక్కలు చె ల్లించుకొని వెళ్తారని, కొండగట్టు ఘాట్‌ రోడ్డుపై మినీ బస్సులు, జీపులు, కార్లు వెళ్లేందుకు అనుమతించేలా మంత్రి ఈశ్వర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మా ట్లాడి జాతర సమయంలో రోడ్డును తెరిపించాలన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఘాట్‌ రోడ్డుపై అనుమతులకు అధికారులతో మాట్లాడుతానన్నారు. బుగ్గారం జడ్పీ సభ్యుడు బాదినేని రా జేందర్‌ మాట్లాడుతూ మూడు నెలల క్రితం మిషన్‌ భగీరథ పైప్‌లైన్లు పగిలిపోయి నీటితో ధా న్యం కొట్టుకుపోయి రైతులు నష్టపోయారని, ఈ విషయంలో అధికారులు వచ్చి రైతులకు నష్టపరిహారం అందిస్తామనిచెప్పినా ఇంత వరకు ఇవ్వలేదన్నారు. 


ధర్మపురి జడ్పీ సభ్యురాలు బత్తిని అరు ణ మాట్లాడుతూ ధర్మపురిలో పలు చోట్ల మిషన్‌ భగీరథ పైప్‌లైన్ల లీకేజీ ఉందని, మరమ్మతులు చే యాలన్నారు. జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు సుభాన్‌ మాట్లాడుతూ మల్యాల మండలం ఓగులాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో కిచెన్‌షెడ్‌ నిర్మాణానికి డ బ్బు వచ్చినా పనులు జరగడం లేదన్నారు. మెట్‌పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను రైతుల కొట్టేస్తున్నారని, మొక్కలు నరికిన రైతులపై చర్య లు తీసుకోవాలని, 65 ఏళ్లు దాటిన వారికి అభయహస్తం పింఛను అందేలా చూడాలన్నారు. జగిత్యాల రూరల్‌ ఎంపీపీ గాజర్ల గంగారాం గౌడ్‌ మా ట్లాడుతూ హరితహారంలో నాటిన ఏడాకుల మొ క్కలతో శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయ ని, ప్రజలు కొట్టేస్తున్నారని, ఈ విషయంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాయికల్‌ జడ్పీటీసీ జాదవ్‌ అశ్విని మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం కార్యక్రమం తో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతం పెరిగిందని, దీ న్ని మరింత పెంచేందుకు అధికారులు కృషి చే యాలన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి పం చాయతీకి ట్రాక్టర్‌ను అందజేస్తున్నారని, ట్రాక్టర్‌ తో గ్రామంలో పారిశుధ్య పనులను చక్కబెట్టుకోవచ్చన్నారు. సమావేశంలో జడ్పీ ఉపాధ్యక్షుడు వొ ద్దినేని హరిచరణ్‌ రావు, జడ్పీ సీఈఓ శ్రీనివాస్‌, డిప్యూటీ సీఈఓ శ్రీలతారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.logo
>>>>>>