మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Jan 31, 2020 , 00:50:47

జగన్నాథుడి వైభవం

జగన్నాథుడి వైభవం
  • మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో కనులపండువగా రథయాత్ర
  • హరినామ సంకీర్తనతో హోరెత్తిన పురవీధులు
  • పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల.. భక్తులతో కలిసి నృత్యం

మారుతీనగర్‌ : వసంత పంచమిని సందర్భంగా మెట్‌పల్లి పట్టణంలో పెద్దాపూర్‌ ఇస్కాన్‌ మందిరం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. ఎమ్మె ల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు హాజరై, జగన్నాథస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథయాత్రను ప్రారంభించారు. భక్తులు, పట్టవాసులతో కలిసి ఎమ్మెల్యే హరినామ సంకీర్తనలు చే స్తూ.. నృత్యం చేశారు. శ్రీకృష్ణుని భక్తి గీతాలతో ప ట్టణ పురవీధులు హోరెత్తాయి. మాజీ ఎమ్మెల్యే కొ మిరెడ్డి రాములు హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ నూతన కార్యవర్గ సభ్యులు, పట్టణ వాసులు పాల్గొన్నారు.


logo
>>>>>>