పుతిన్ ప్రతిపాదనలకు ఓకే చెప్పిన జెలెన్స్కీ !
కీవ్: రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదినలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్యాతో శాంతి చర్చలు నిర్వహించేందుకు జెలెన్స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్ సెక్రటరీ సెర్గే నికిఫరోవ్ తెలిపారు. కాల్పుల విరమణకు కూడా జెలెన్స్కీ ఆమోదం తెలిపినట్లు సెర్గే చెప్పారు. చర్చలను తిరస్కరించినట్లు వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని, శాంతి, కాల్పుల విరమరణ ఒప్పందానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉందని, ఇదే మా శాశ్వత సిద్ధాంతమని, రష్యా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనలను తాము అంగీకరిస్తున్నామని తన ఫేస్బుక్ పేజీలో సెర్గే తెలిపారు. అయితే శాంతి చర్చలకు సంబంధించిన స్థలం, తేదీ గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు నికోఫరోవ్ తెలిపారు. చర్చలు ఎంత వేగంగా జరిగితే, అంత త్వరగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ఆయన అన్నారు. మిన్స్క్లో చర్చలు నిర్వహించాలని రష్యా భావించగా.. వార్సాలో జరిగే బాగుంటుందని ఉక్రెయిన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
మరో వైపు జెలెన్స్కీ ఇవాళ ఓ సెల్ఫ్ వీడియోను పోస్టు చేశారు. కీవ్ వీధుల్లో తిరుగుతూ ఆయన ఆ వీడియో తీశారు. రష్యా దళాలకు లొంగిపోవాలని పిలుపు ఇచ్చినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఆయన ఈ వీడియోను పోస్టు చేశారు. ఆయుధాలను వీడాలని పిలుపు ఇవ్వలేదని ఆయన ఆ వీడియోలో స్పష్టం చేశారు. ఆన్లైన్లో నకిలీ సమాచారం వ్యాప్తి అవుతోందని, తాము ఆయుధాలను వీడడం లేదని, తమ దేశాన్ని తాము రక్షించుకుంటామని జెలెన్స్కీ అన్నారు.
Не вірте фейкам. pic.twitter.com/wiLqmCuz1p
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

