Xi Jinping | అమెరికా, చైనా పరస్పర భిన్న ధృవాలు.. ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో.. చైనా రెండో స్థానంలో ఉన్నాయి. కానీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఏకైక తనయ జీ మెంగ్జీ ప్రస్తుతం అగ్రదేశంలో నివసిస్తున్నారట.. ఈ సంగతిని అమెరికా కాంగ్రెస్ సెనెటర్ వికీ హార్ట్జ్లర్ బయట పెట్టారు. సదరు జీ మెంగ్జీ కూడా జీ జిన్‌పింగ్‌కు, ఆయన ద్వితీయ భార్య, ప్రసిద్ధ జానపద గాయకురాలు పెంగ్ లియువాన్‌కు జన్మించిన ఏకైక పుత్రికా రత్నమట. చైనా కమ్యూనిస్టు పార్టీ చట్టం నుంచి ఉన్నత విద్యను పరిరక్షిస్తున్నట్లు చెప్పారట. ఆదివారం అమెరికాలో నివసిస్తున్న ఓ చైనీస్ కరంట్ అఫైర్స్ కామెంటేటర్ ప్రారంభించిన యూ-ట్యూబ్ చానెల్‌కు హార్జ్ట్లర్ ఈ సంగతి చెప్పారు. అంతే కాదు అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి స్వదేశానికి వచ్చి ఐదేండ్లు జీవించాక తిరిగి ఆమె అమెరికాకు వచ్చేశారు.
1992 జూన్ 27న జన్మించిన జీ మింగ్జీ.. హ్యాంగ్జౌ ఫారిన్ లాంగ్వేజెస్ స్కూల్లో ఫ్రెంచ్ అభ్యసించారు. 2010లో మాసాచుసెట్స్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదవడానికి అమెరికాకు వచ్చేశారు. కానీ 2012 వరకు ఆమె గురించి చాలా మందికి తెలియదని సమాచారం.
రీసెర్చ్ విద్యార్థిగా మెంగ్జీ ప్రస్తుతం కేంబ్రిడ్జి ప్రాంతంలోనే నివసిస్తున్నారని ఆ కామెంటేటర్ చెప్పారు. ఇంతకుముందు వెబ్సైట్ టెక్నీషియన్-చైనీయుడు.. జీ జిన్‌పింగ్ కూతురు వ్యక్తిగత సమాచారం లీక్ చేసినందుకు 14 ఏండ్ల జైలుశిక్షకు గురయ్యాడు. ఇదిలా ఉంటే చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ కాంగ్రెస్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు విద్యార్థి లేదా, రీసెర్చ్ వీసా జారీ చేయకుండా నిషేధించాలని అమెరికా సెనెటర్ హార్ట్జ్లర్ చెప్పారు.