బీజింగ్: ఒక దేశం, రెండు వ్యవస్థలు అన్న విధానాన్ని కట్టుబడి ఉన్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. ఆ మోడల్ ప్రకారమే హాంగ్ కాంగ్ నగరాన్ని రక్షిస్తున్నామని, ఇది సుదీర్ఘ కాలం కొనసాగుతుందని జిన్‌పింగ్ చెప్పారు. హాంగ్ కాంగ్లో చైనా ఆధిపత్యాన్ని ఆయన సమర్ధించుకున్నారు. హాంగ్ కాంగ్లో చేసిన ప్రసంగంలో ఆయన చైనా రాజకీయ వ్యవస్థా విధానాన్ని డిఫెండ్ చేసుకున్నారు. బ్రిటన్ నుంచి హాంగ్‌కాంగ్‌ను చైనాకు అప్పగించి 25 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో హాంగ్ కాంగ్‌ను జిన్ పింగ్ విజిట్ చేశారు. రెండేళ్ల తర్వాత ఆయన స్వదేశం విడిచి బయటకు వెళ్లారు. ఒకదేశం, రెండు వ్యవస్థల వల్ల హాంగ్ కాంగ్‌కు స్వేచ్ఛ లభిస్తుందని, భావ స్వేచ్ఛను రక్షిస్తుందని, చైనాలో లేని హక్కుల్ని ఇక్కడ పొందవచ్చు అని తెలిపారు. కానీ ఇటీవల కాలంలో హాంగ్ కాంగ్‌పై చైనా వత్తిళ్లు పెంచుతోందని, చట్టాలను రూపొందిస్తూ సంస్కరణలు చేపడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.