ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఇకలేరు.. 118వ ఏట కన్నుమూసిన సిస్టర్ ఆండ్రీ
Lucile Randon | ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ఫ్రెంచ్ సన్యాసిని సిస్టర్ లూసిల్ రాండన్ (118) కన్నుమూశారు. సిస్టర్ ఆండ్రీగా గుర్తింపు పొందిన ఆమె మంగళవారం రాత్రి ఫ్రాన్స్‌లోని టౌలాన్ ఉన్న తన
పారిస్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, ఫ్రెంచ్ సన్యాసిని సిస్టర్ లూసిల్ రాండన్ (118) కన్నుమూశారు. సిస్టర్ ఆండ్రీగా గుర్తింపు పొందిన ఆమె మంగళవారం రాత్రి ఫ్రాన్స్‌లోని టౌలాన్ ఉన్న తన నర్సింగ్ హోమ్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆండ్రీ ప్రతినిధి డేవిడ్ తవెల్లా వెల్లడించారు. మరో నెల రోజుల్లో 119వ పుట్టినరోజు జరుపుకోనుండగా ఆమె మరణించడం గమనార్హం.
కాగా, లూసిల్ రాండన్ 1904, ఫిబ్రవరి 11న జన్మించారు. ఆమె అసలుపేరు లూసిల్ రాండన్. 1944లో సిస్టర్ ఆండ్రీగా మారిన ఆమె 1918లో స్పానిష్ ఫ్లూ మహమ్మారి నుంచి బయటపడ్డారు. కొవిడ్-19 నుంచి బయటపడిన అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందారు. రెండు ప్రపంచ యుద్ధాలను కళ్లారా చూసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయురాలిగా, గవర్నస్‌గా పనిచేశారు. విచీ, ఆవెర్గ్నే-రోన్-ఆల్ఫ్స్‌లోని దవాఖానలో 28 ఏళ్లపాటు అనాథలు, వృద్ధులకు సేవలు అందించారు. ఇప్పటి వరకు నమోదైన ఫ్రెంచ్, యూరోపియన్ వృద్ధులలో ఆండ్రీ మూడో వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

