న్యూయార్క్, జనవరి 3: ఈ నెలాఖరులో మెగా అరంగేట్రానికి ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ‘ఐకాన్ ఆఫ్ ద సీస్’ సిద్ధమవుతున్నది. తుది మెరుగులు, తనిఖీల కోసం అరేబియన్కు చేరుకుంది. చూడగానే వావ్ అనిపించే ఈ అద్భుతమైన క్రూయిజ్ షిప్ ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన టైటానిక్ కన్నా ఐదు రెట్లు పొడవైనది. ఈ నెల 27న ప్రయాణానికి అందుబాటులోకి రానుంది. ఈ క్రూయిజ్ నౌక 365 మీటర్ల పొడవు, 2,50,800 టన్నుల బరువు కలిగి ఉంది. రెండు బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ క్రూయిజ్‌లో 5,610 మంది ప్రయాణికులతో పాటు 2,350 మంది సిబ్బంది ఉంటారు. 30 డెక్‌లు, ఒక ఫుడ్ హాల్, ఆరు పూల్స్, రిసార్టు గేట్‌వే, అతి పెద్ద వాటర్ పార్క్‌లతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.