Amazon forest | వండర్ కిడ్స్.. అమెజాన్ అడవుల్లో 40 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన నలుగురు చిన్నారులు
ప్రపంచంలోనే దట్టమైన అడవి అది. ఎన్నో క్రూరమృగాలకు, మరెన్నో విషసర్పాలకు నెలవు ఆ అరణ్యం. అంతటి అడవిలో ప్రాణాలను కాపాడుకునేందుకు 40 రోజులు పోరాడారు నలుగురు చిన్నారులు.
Amazon forest | బొగొటా, జూన్ 10: ప్రపంచంలోనే దట్టమైన అడవి అది. ఎన్నో క్రూరమృగాలకు, మరెన్నో విషసర్పాలకు నెలవు ఆ అరణ్యం. అంతటి అడవిలో ప్రాణాలను కాపాడుకునేందుకు 40 రోజులు పోరాడారు నలుగురు చిన్నారులు. ఏం తిన్నారో.. ఎక్కడ పడుకున్నారో.. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడి వండర్ కిడ్స్‌గా నిలిచారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేశారు. వివరాల్లోకెళ్తే.. మే 1న కొలంబియాలోని అమెజానియన్ అనే గ్రామం నుంచి శాన్జోస్డెల్ గువియేర్ అనే పట్టణానికి ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం అమెజాన్ అడవుల్లో కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణించిన ఒక మహిళ, పైలట్, కో పైలట్ ప్రమాదంలో కన్నుమూశారు. మే 16న ప్రమాదస్థలి వద్ద మృతదేహాలను గుర్తించారు. నలుగురు పిల్లలు మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ నలుగురి వయస్సు 13 ఏండ్లు, తొమ్మిదేండ్లు, నాలుగేండ్లు, 11 నెలలు. కానీ, ప్రమాదస్థలి వద్ద చిన్నారుల ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కొలంబియా భద్రతా బలగాలు వీరి జాడ కోసం గాలింపు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో అడవిలో ఓ చోట పిల్లలు తాగే వాటర్ బాటిల్, డైపర్, మనుషులు కొరికినట్టుగా ఉన్న పండు కనిపించింది. అక్కడే చిన్న గుడారంలా వేసి ఉన్నది. దీంతో చిన్నారులు బతికే ఉన్నారనే ఆశ కలిగింది. గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. కానీ, ఆ తర్వాత రోజులు గడుస్తున్నా పిల్లల ఆచూకీ దొరకలేదు. మళ్లీ నైరాశ్యం అలుముకున్నది. చివరకు శుక్రవారం నాడు భద్రతా సిబ్బంది తీసుకెళ్లిన ఓ జాగిలం పిల్లల జాడను గుర్తించింది. పిల్లలు దొరికినట్టు కొలంబియా అధ్యక్షుడు పెట్రో ట్వీట్ చేశారు. వారు పూర్తి సురక్షితంగా ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

