సింహాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి.. అడవికి అవి రాజు. అడవిలో వాటి తర్వాతనే ఇంకే జంతువైనా. సింహానికి ఉన్న పవర్ మరే జంతువుకు ఉండదు. అందుకే.. సింహాలు అంటేనే అందరూ దడుసుకుంటారు. వాటిని చూస్తే చాలు.. భయం పుడుతుంది. అవి గర్జించాయంటే ఇక అంతే. అటువంటి సింహాలతో ఓ మహిళ ఎంతో చనువుగా ఉంది. సింహాలకే తాను క్వీన్ అన్నట్టుగా వాటితో పాటు నడుచుకుంటూ అడవిలో వెళ్లింది.
దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి.. ఇది నిజమేనా.. లేక ఉత్తుత్తి వీడియోనా. అసలు.. అన్ని సింహాలతో కలిసి నడవడం అంటే మామూలు విషయమా. ఇదేదో గ్రాఫిక్స్‌లో యాడ్ చేసిన వీడియో కావచ్చు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న జూకి సంబంధించింది అయి ఉండొచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే.. సఫారీ గ్యాలరీ పేరుతో ఉన్న ఓ ఇన్‌స్టాలో ఈ వీడియోను అప్లోడ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.