ప్రస్తుతం ప్లాస్టిక్ వల్ల ప్రపంచమంతా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. ప్లాస్టిక్ వాడకం నేటి జనరేషన్లో ఎక్కువైపోయింది. దీంతో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతోంది. అందుకే.. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ప్రభుత్వాలు ప్రజలు కోరుతున్నాయి. అయినా కూడా ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గడం లేదు.
అయితే.. ఓ మహిళ మాత్రం ప్లాస్టిక్ కవర్లను సేకరించే పనిలో పడింది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 10 వేల పాత కాలం నాటి ప్లాస్టిక్ కవర్లను సేకరించింది. యూకేకు చెందిన ఏంజెలా క్లార్కెకు ఇలా పాత ప్లాస్టిక్ బ్యాగులను సేకరించే అలవాటు 1976 నుంచి ఉందట. కొన్ని లక్షల రూపాయల విలువ చేసే ప్లాస్టిక్ బ్యాగులను తన భర్త ఫ్యాక్టరీలో దాచిపెట్టింది ఏంజెలా.
1954 కాలం నాటి బ్యాగులు కూడా తన దగ్గర ఉన్నాయి. దాదాపు 40 ఏళ్ల నుంచి తనకు ఈ అలవాటు ఉంది. అప్పటి ప్లాస్టిక్ బ్యాగులను సేకరించి తను ప్రపంచ రికార్డు కూడా క్రియేట్ చేసింది. తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇలా ప్లాస్టిక్ కవర్లను సేకరించడం ఒక అలవాటుగా మారిందట.
చాలామందికి నాణేల సేకరణ అలవాటు ఉంటుంది.. విదేశీ కరెన్సీ సేకరణ అలవాటు ఉంటుంది కానీ.. ఈ మహిళకు విచిత్రంగా ప్లాస్టిక్ కవర్లను సేకరించే అలవాటు ఉండటం భలే విచిత్రంగా ఉంది కదా.