Woman boss | ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రూ.80లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్..!
Woman boss | ట్విట్టర్ మొదలుకొని పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుంటే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ లేడీ బాస్ మాత్రం తమ ఉద్యోగులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. కంపెనీలోని పలువురు ఉద్యోగులకు ఏకంగా రూ.80లక్షల బోనస్ ప్రకటించి ఆనదంలో ముంచెత్తింది.
Woman boss | ట్విట్టర్ మొదలుకొని పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుంటే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ లేడీ బాస్ మాత్రం తమ ఉద్యోగులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. కంపెనీలోని పలువురు ఉద్యోగులకు ఏకంగా రూ.80లక్షల బోనస్ ప్రకటించి ఆనదంలో ముంచెత్తింది.
ఆస్ట్రేలియాలో హాన్కాక్ ప్రాస్పెక్టింగ్ అనే మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీకి జార్జినా (గినా) రెన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచిన ఆమె 34 బిలియన్ డాలర్ల సంపదతో ఆస్ట్రేలియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆమె తండ్రి స్థాపించిన హాన్కాక్ ప్రాస్పెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ అనే మరో సంస్థలోని ఉద్యోగులతో ఇటీవల ఆమె సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె సమావేశంలో మాట్లాడుతూ సంస్థలోని 10 మంది ఉద్యోగుల పేర్లను చదివి వినిపించారు. ఆ పేర్లు విన్న వారు తమ ఉద్యోగాలు పోయినట్టేనని భావించారు. అయితే, ఆ తర్వాత ఆమె వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ఆ 10 మంది ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్‌గా ఒక్కొక్కరికి లక్ష అమెరికన్ డాలర్ల (దాదాపు రూ. 80 లక్షలు) చొప్పున బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. బోనస్ అందుకోబోతున్న పది మందిలో మూడు నెలల క్రితమే కంపెనీలో చేరిన ఓ ఉద్యోగి కూడా ఉండడం గమనార్హం. కాగా, గడిచిన 12 నెలల కాలంలో ఆ కంపెనీ లాభాలు 3.3 బిలియన్ డాలర్లు ఉన్నాయట. ఈ మేరకు వివరాలను ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Australia
- bonus
- surprise
- Woman boss
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

