Wimbledon Ban | రష్యా, బెలారస్ ప్లేయర్లపై నిషేధం.. ఏటీపీ ఖండన!
Wimbledon Ban | ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా, దాని మద్దతుదారు బెలారస్ ప్లేయర్లపై వింబుల్డన్ నిషేధం విధించింది.
Wimbledon Ban | ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను కట్టడి చేసేందుకు వింబుల్డన్ కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యాతోపాటు దానికి మద్దతుగా ఉన్న బెలారస్ ఆటగాళ్లను వింబుల్డన్ చాంపియన్‌షిప్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ప్రకటించింది. వింబుల్డన్ టోర్నీని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (ఏఈఎల్టీసీ) నిర్వహిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వింబుల్డన్ చాంపియన్‌షిప్ టోర్నీలను నిర్వహిస్తున్న తమ క్లబ్‌కు రష్యాను కట్టడి చేయాలన్న ప్రభుత్వ చర్యల్లో భాగం కావాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. ఈ ఏడాది జరిగే చాంపియన్‌షిప్ టోర్నీలకు రష్యా, బెలారస్ ఆటగాళ్లను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల రష్యా మెన్స్ వరల్డ్ నంబర్-2 డానిల్ మెద్వెదేవ్, నంబర్ 8 అండ్రీ రుబ్లేవ్, మహిళల్లో నాలుగో ర్యాంక్ ఆర్య్నా షాబాలెంకా, 18వ స్థానంలో ఉన్న విక్టోరియా (బెలారస్)ల ఈ ఏడాది టోర్నీలకు దూరమే.
వింబుల్డన్ నిర్ణయంపై టెన్నిస్ అసోసియేషన్లు, సీనియర్ ప్లేయర్లు మండిపడ్డారు. ఇది దారుణమైన సంప్రదాయానికి దారి తీస్తుందని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్లేయర్స్ (ఏటీపీ) పేర్కొంది. వింబుల్డన్ తీసుకున్న నిర్ణయం ఏకపక్షం అని పేర్కొంది. ఏటీపీ ర్యాంకింగ్‌ల ఆధారంగా మాత్రమే ఆటగాళ్లను అనుమతించాలని సూచించింది. ఉమెన్ టెన్నిస్ అసోసియేసన్ (డబ్ల్యూటీఏ) స్పందిస్తూ ఎటువంటి వివక్షకు చోటు లేకుండా ప్రతిభ ఆధారంగా క్రీడాకారులను అనుమతించాలని సూచించింది.
చెక్ సంతతికి చెందిన అమెరికా మార్టినా నవరట్లివా స్పందిస్తూ.. ఆటగాళ్లకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. వింబుల్డన్ నిర్ణయం తప్పిదమని పేర్కొన్నారు. మరో నంబర్ వన్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్ స్పందిస్తూ.. క్రీడల్లో రాజకీయాలు జోక్యం చేసుకుంటే సత్ఫలితాలు రావన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

