వాషింగ్టన్, జనవరి 28: ఇంటర్నెట్ యుగంలో తిరుగులేని గూగుల్ భవిష్యత్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్‌జీపీటీ రాకతో గూగుల్ గల్లంతవడం ఖాయమా? గూగుల్ సెర్చ్ ఇంజిన్ వినియోగం ఇక తగ్గిపోతుందా? అంటే అవుననే అంటున్నారు టెక్ నిపుణులు. చాట్‌జీపీటీతో గూగుల్‌కు భారీ నష్టం జరగబోతున్నదని జీమెయిల్ సృష్టికర్త పాల్ బుచెయిట్ అంచనా వేశారు. ఇందుకు ఏడాది లేదా రెండేండ్లు పట్టొచ్చని పేర్కొన్నారు.
గూగుల్‌కు ప్రధాన ఆదాయ వనరు అయిన సెర్చ్ ఇంజిన్ పేజ్‌ను చాట్‌జీపీటీ పూర్తిగా కనుమరుగయ్యేలా చేయవచ్చని ఆయన తెలిపారు. గతంలో ‘యెల్లో పేజెస్’ను గూగుల్ ఎలా దెబ్బతీసిందో, ఇప్పుడు గూగుల్‌కు కూడా చాట్‌జీపీటీతో ఇదే పరిస్థితి ఎదురుకాబోతున్నదని ఆయ న అభిప్రాయపడ్డారు.