ఒమిక్రాన్, డెల్టాతో సునామీలా కేసులు.. వార్నింగ్ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. కోవిడ్ కేసులు సునామీలా విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. పెను విషాదాన్ని మిగిల్చిన డెల్టా వేరియంట్‌తో పాటు ప్రస్తుతం శరవేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కోవిడ్ కేసులు హెచ్చు స్థాయిలో పెరిగే అవకావం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. దీంతో జాతీయ ఆరోగ్య వ్యవస్థలపై పెను ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. టెడ్రోస్ గేబ్రియాసిస్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేగాన్ని గమనిస్తే ఆందోళన కలుగుతోందని, ఇప్పటికే డెల్టా కేసులూ ఉన్నాయని, దీంతో పాజిటివ్ కేసుల సునామీ తప్పదని ఆయన హెచ్చరించారు. ఆరోగ్య వ్యవస్థ తీవ్ర వత్తిడికి లోనవ్వడం వల్ల.. మళ్లీ ప్రజల జీవితాలపై పెను భారం తప్పదన్నారు. హాస్పిటల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుందని, దాంతో పాటు హెల్త్ వర్కర్లు కూడా భారీగా అస్వస్థతకు లోనయ్యే అవకాశాలు ఉన్నట్లు టెడ్రోస్ అంచనా వేశారు.ఒమిక్రాన్‌తో వ్యాధి తీవ్రత లేదని నిర్లక్ష్యంగా ఉండరాదని, చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ఒమిక్రాన్ యువతకు ఎక్కువగా సోకుతోందని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

