Yevgeny Prigozhin: ఎవరీ యేవ్జెని ప్రిగోజిన్.. ఏంటీ వాగ్నర్ మిలిటరీ ?
Yevgeny Prigozhin: వాగ్నర్ మిలిటరీ దళాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తే యేవ్జెని ప్రిగోజిన్. ఒకప్పుడు ఈయన పుతిన్‌కు చెఫ్. ప్రస్తుతం ప్రైవేటు దళానికి బాస్. అయితే రక్షణ మంత్రి షోయుగు తమకు ఆయుధాలు ఇవ్వడంలేదని ప్రిగోజిన్ ఆరోపిస్తున్నాడు.
మాస్కో: వాగ్నర్ గ్రూపు. ఇది రష్యా ప్రైవేటు మిలిటరీ దళం. దీన్ని యేవ్జెని ప్రిగోజిన్( Yevgeny Prigozhin) స్థాపించారు. 2014లో మొదటిసారి ఆ గ్రూపును ఏర్పాటు చేశారు. తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా వేర్పాటువాద దళాలకు తొలుత అండగా ఉన్నారు. ఆ సమయంలో ఇదో సీక్రెట్ ఆర్గనైజేషన్. ఈ గ్రూపుకు చెందిన దళాలు ఎక్కువగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌లో ఆపరేట్ చేశాయి. దాదాపు 5 వేల మంది ఫైటర్లు ఆ దళంలో ఉన్నారు. వీళ్లంతా గతంలో రష్యా ఆర్మీలో చేసినవాళ్లే.
గత పదేళ్ల నుంచి ఉక్రెయిన్ బోర్డర్ వెంట రష్యా ఆర్మీకి అండగా వాగ్నర్ గ్రూపు పోరాడింది. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో వాళ్లు తమ బలాన్ని కేంద్రీకరించారు. అయితే ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు 50 వేల మంది ఫైటర్లు వాగ్నర్ ఆధీనంలో ఉన్నట్లు ఇటీవల బ్రిటన్ రక్షణ మంత్రి తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత వాగ్నర్ గ్రూపు భారీ సంఖ్యలో ఫైటర్లను రిక్రూట్ చేసుకున్నది. బక్ముత్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఈ గ్రూపే కీలక పాత్ర పోషించింది.
నిజానికి వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు చేయడానికి మరో కారణం ఆ దేశ రక్షణ మంత్రి సెర్గీ షోయుగు. వాస్తవానికి ప్రిగోజిన్, షోయుగు ఇద్దరూ శక్తివంతమైన వ్యక్తులు. ఆ ఇద్దరి మధ్య అధికార పోరాటమే ఇప్పుడు ఇలా సైనిక తిరుగుబాటుకు కారణమైనట్లు భావిస్తున్నారు. డాన్బాస్ ప్రాంతంలో రష్యా ఆర్మీ డీలాపడడం.. ఆ స్థానంలో వాగ్నర్ గ్రూపు రాణించడంతో.. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు చెలరేగింది. ప్రిగోజిన్ తన దళాల్ని విజయవంతంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన తన ప్రొఫైల్‌ను పెంచేసుకున్నారు. మరో వైపు షోయుగు నేతృత్వంలోని రష్యా ఆర్మీ డీలాపడింది.

Putinchef
తమ దళాలకు కావాల్సిన ఆయుధాలను షోయుగు ఇవ్వలేకపోతున్నట్లు ప్రిగోజిన్ ఆరోపించారు. వాగ్నర్ దళాలను వెనక్కి తీసుకునేందకు కూడా వెనుకాడేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. వాస్తవానికి పుతిన్‌ను ఎప్పుడూ ప్రిగోజిన్ విమర్శించలేదు. కానీ ఆయన చుట్టు ఉన్న వ్యక్తులపై మాత్రం వాగ్నర్ బాస్ ఫైర్ అయ్యాడు.
సైనిక తిరుగుబాటకు దిగిన ప్రిగోజిన్ .. ఓ దశలో పుతిన్‌కు సన్నిహితంగా ఉన్నారు. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించడంలో పుతిన్‌కు ప్రిగోజిన్ అండగా నిలిచారు. రష్యా జైళ్లల్లో ఉన్న వేలాది మంది ఖైదీలను తన దళంలో రిక్రూట్ చేసుకున్నాడు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు ప్రిగోజిన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆఫ్రికాలో రష్యా ప్రాబల్యాన్ని కూడా పెంచేందుకు ప్రయత్నించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
ప్రిగోజిన్ ఒకప్పుడు హాట్ డాగ్స్ అమ్మేవాడు. క్యాటరింగ్ కంపెనీ నడిపాడు. క్రెమ్లిన్‌కు ఫుడ్‌ను సరఫరా చేసేవాడు. పుతిన్ చెఫ్ అన్న నిక్‌నేమ్‌ను అతను సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల మాత్రం రష్యా అధికారులను తరుచూ అతను విమర్శిస్తూ వస్తున్నాడు. తమ దళానికి ఆయుధాలు ఇవ్వకుండా రక్షణ మంత్రి గేమ్స్ ఆడుతున్నాడని ప్రిగోజిన్ ఆరోపించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

