మలాలా యూసఫ్‌జాయ్ భర్త ఎవరు? ఏం చేస్తాడో తెలుసా ?

లండన్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూసుఫ్‌జాయి మలాలా పెళ్లి చేసుకున్నది. బర్మింగ్‌హామ్‌లో నిఖా వేడుక చాలా సింపుల్‌గా జరిగింది. ఆమె భర్త పేరు అసర్ మాలిక్. అయితే మాలిక్ ఎవరని ప్రస్తుతం ఇంటర్నెట్లో జోరుగా సెర్చ్ సాగుతోంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ తమ పెళ్లి ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. మలాలా భర్త అసర్ మాలిక్ ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హై పర్ఫార్మెన్స్ సెంటర్లో జనరల్ మేనేజర్‌గా చేస్తున్నాడు. గత ఏడాది మే నెలలో ఆయన పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఉద్యోగిగా చేరాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్న ముల్తాన్ సుల్తాన్ జట్టుకు కూడా పనిచేశాడు. ముల్తాన్ సుల్తాన్ జట్టుకు అతను ఆపరేషనల్ మేనేజర్‌గా చేశాడు. గతంలో అసర్ మాలిక్.. ప్లేయర్ మేనేజ్మెంట్ ఏజెన్సీని కూడా నడిపారు. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ నుంచి 2012లో ఆర్థికశాస్త్రం, రాజనీతి శాస్త్రం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పట్టా పొందారు.
Today marks a precious day in my life.
— Malala Yousafzai (@Malala) November 9, 2021
Asser and I tied the knot to be partners for life. We celebrated a small nikkah ceremony at home in Birmingham with our families. Please send us your prayers. We are excited to walk together for the journey ahead.
📸: @malinfezehai pic.twitter.com/SNRgm3ufWP
పాకిస్థాన్‌లో బాలికల విద్యాహక్కు గురించి మలాలా పోరాటం చేశారు. ఖైబర్ ఫక్తున్సాలోని స్వాట్ వ్యాలీ ఆమె సొంతం ప్రదేశం. అయితే అక్కడ తాలిబన్ల అరాచకం కొనసాగేది. అమ్మాయిల చదువును తాలిబన్లు అడ్డుకునేవారు. ఆ సమయంలో మలాలా ఉద్యమం చేపట్టారు. దానికి ప్రతీకారంగా 2012, అక్టోబర్ 9న మలాలాపై తాలిబన్ల దాడి చేశారు. ఆ దాడిలో మలాలా తలకు తీవ్ర గాయమైంది. బుల్లెట్లు దిగడంతో మలాలా కొన్ని రోజులు కోమాలోకి వెళ్లింది. తొలుత రావల్పిండిలో చికిత్స తీసుకున్నది. బర్మింగ్‌హామ్‌లో ఆమె పుర్రెకు సర్జరీ చేశారు. మహిళల విద్యాహక్కు గురించి పోరాటం చేసిన మలాలాకు 2014లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

