Vladimir Putin | తీవ్ర అనారోగ్యంతో పుతిన్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు, వైద్యబృందం..!
Vladimir Putin | గతేడాది ఉక్రెయిన్ (Ukraine)పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అనారోగ్యంపై రకరకాలుగా వార్తలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పుతిన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ మరోసారి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
Vladimir Putin | గతేడాది ఉక్రెయిన్ (Ukraine)పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అనారోగ్యంపై రకరకాలుగా వార్తలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. పుతిన్ క్యాన్సర్ సంబంధిత చికిత్స చేయించుకున్నారని, పార్కిన్సన్స్తో బాధపడుతున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. అయితే అవన్నీ వదంతులే అని, అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉన్నారంటూ రష్యా నేతలు చెప్పుకొచ్చారు. కాగా, తాజాగా పుతిన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ మరోసారి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
పుతిన్ ఆరోగ్యం మరింత క్షీణించిందని.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రామ్ ఛానెల్ (General SVR Telegram channel) తన కథనంలో నివేదించింది. అతను ప్రస్తుతం తీవ్రమైన తలనొప్పి, అస్పష్టమైన కంటిచూపు, నాలుక తిమ్మిరితో బాధపడుతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా పుతిన్ తన కుడి చేయి, కాలులో పాక్షికంగా స్పర్శ కోల్పోయినట్లు కూడా పేర్కొంది. వైద్య బృందం పుతిన్‌కు చికిత్స అందిస్తోందని.. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆదేశించినట్లు నివేదించింది.
అయితే విశ్రాంతి తీసుకునేందుకు పుతిన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై దాడికి సంబంధించిన నివేదికలతో బిజీగాఉన్నట్లు రిపోర్టు తెలిపింది. ప్రస్తుతం పుతిన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్య బృందం ఆందోళన చెందుతున్నట్లు నివేదించింది.
Also Read..
Chinese spy balloon | చైనా స్పై బెలూన్ వివరాలను భారత్‌తో పంచుకున్న అమెరికా
ChatGPT | ఆరోగ్యకరమైన అల్పాహారం ఏంటి..? చాట్ జీపీటీ సమాధానం ఇదీ..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

