Viral Video : నేపాల్ వరదలకు సంబంధించిన అనేక దృశ్యాలు గుండె బరువెక్కేలా చేస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారి, నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర వీడియో బయటపడింది. వరద కారణంగా చుట్టూ అంతా కొట్టుకుపోతున్నా.. ఒక్క ఇల్లు మాత్రం మధ్యలో తట్టుకుని నిలబడింది. ఆ ఇంట్లోని వారు కూడా అటు నిస్సహాయంగా.. ఇటు ధైర్యంగా నిలబడి సాయం కోసం ఎదురు చూశారు.
ప్రాణాలు తీసే అంత వరదలోనూ ఇంటిపై నిలబడి గుండె ధైర్యాన్ని చాటుకున్నారు. నేపాల్‌లో బుధవారం ఉదయం ఆకస్మిక వరద సంభవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనేక మంది గల్లంతు కాగా, ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి. ఈ వరదలో ఒక ఊరిలో మాత్రం ఒక ఇల్లు అలాగే ఉంది. ఈ ప్రదేశం ఎక్కడో, ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కచ్చితంగా తెలియదు. కానీ, వీడియో ప్రకారం.. నేపాల్‌లో ఒక ఊరిని భారీ వరద ముంచెత్తింది. దీంతో అనేక ఇండ్లు, వాహనాలు వంటివి కొట్టుకుపోసాగాయి.
That family in the green house. I hope they are alive and safe. 🙏🏻 what a nightmare. pic.twitter.com/t2tVR2cFD7
— Pooja Shali (@PoojaShali) August 28, 2026
అందులో చిక్కుకున్న వారిని రక్షించడం కూడా సాధ్యం కానంత వేగంగా, భారీ ఎత్తున వరద ముంచెత్తింది. ఈ వరదలో చుట్టూ అన్ని ఇండ్లూ కొట్టుకుపోతున్నా ఒక్క ఇల్లు మాత్రం అలాగే నిలబడి ఉంది. పైగా ఆ ఇంటిలోని వారు డాబా పైకి ఎక్కి సాయం కోసం చూస్తూ ఉన్నారు. వారి కళ్లముందే అంత వరద వస్తున్నా నిలబడి ధైర్యంగా ఆ పరిస్థితిని దాటారు. అక్కడికి దూరంగా ఉన్నవారు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. తర్వాత ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆ ఇంట్లోని వారు కూడా సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు.. ఇంత వరద ప్రవాహాన్ని తట్టుకునేలా ఇల్లు కట్టిన బిల్డర్‌కు ‘నేపాల్ రత్నమాన్ పాదావి’ అనే అవార్డు ఇవ్వాలంటూ నెటిజన్లు కోరుతున్నారు.
ఎందుకంటే అన్ని ఇండ్లూ కొట్టుకుపోతున్నా.. ఆ ఇల్లు మాత్రం ఇంకా అలాగే, చెక్కు చెదరకుండా ఉంది. కచ్చితంగా ఇది గొప్ప నిర్మాణంగానే చెప్పాలి. ఇక.. ఈ వరదల్లో వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికే 547 మందికిపైగా మరణించినట్లు సమాచారం. మరో 1,500 మందికి సంబంధించిన సమాచారం తెలియరాలేదు. ఇందులో ఇండియన్స్ 320 మంది వరకు ఉన్నారు. ఈ భయంకర వరద అక్కడి వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. వేగంగా, ఉవ్వెత్తున ఎగసిపడుతూ దూసుకొచ్చిన వరదను చాలా మంది ఎదుర్కోలేకపోయారు. దీంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.