Vijay Mallya | విజయ్ మాల్యా ఇంట పెళ్లి సందడి.. ప్రేయసిని పెళ్లాడబోతున్న సిద్ధార్థ్ మాల్యా
Vijay Mallya | బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న బిలియనీర్ విజయ్ మాల్యా (Vijay Mallya) ఇంట పెళ్లి సందడి (Wedding) మొదలైంది.
Vijay Mallya | బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న బిలియనీర్ విజయ్ మాల్యా (Vijay Mallya) ఇంట పెళ్లి సందడి (Wedding) మొదలైంది. ఆయన తనయుడు సిద్ధార్థ్ మాల్యా (Sidhartha Mallya) త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ప్రేయసి జాస్మిన్ (Jasmine)ను సిద్ధార్థ్ వివాహం చేసుకోబోతున్నాడు. ఈ వారంలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ విషయాన్ని సిద్ధార్థ్ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించారు. ‘పెళ్లి వారం మొదలైంది’ అంటూ ప్రేయసితో దిగిన అందమైన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.
సిద్ధార్థ్ మాల్యా, జాస్మిన్ మంచి స్నేహితులు. వీరి స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. గతేడాది హాలోవీన్ (Halloween 2023) రోజున జాస్మిన్‌కు సిద్ధార్థ్ మాల్యా ప్రపోజ్ చేసాడు. మోకాళ్లపై కూర్చొని తన ప్రేమను వ్యక్త పరిచాడు. ఇక సిద్ధార్థ్ ప్రేమను జాస్మిన్ కూడా అంగీకరించింది. దీంతో జాస్మిన్ చేతికి సిద్ధార్థ్ మాల్యా రింగ్ కూడా తొడిగాడు. అనంతరం ఇద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పట్లోనే ఈ జంట తమ ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు.
Also Read..
Trivikram Srinivas | కాలినడకన తిరుమల వెళ్లి.. శ్రీవారిని దర్శించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
Sonakshi Sinha | ఈ నెల 23న పెళ్లి.. బ్యాచిలర్ పార్టీ చేసుకున్న సోనాక్షి సిన్హా.. ఫొటోలు వైరల్
Bomb Threat | ఢిల్లీ – దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

