Mexico Firing | న్యూ మెక్సికోలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
Mexico Firing | అమెరికాలోని న్యూ మెక్సికో నగరంలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. రెడ్ రివర్ ఏరియాలో చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వాషింగ్టన్: అమెరికాలోని న్యూ మెక్సికో నగరంలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. రెడ్ రివర్ ఏరియాలో చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హెలిక్యాప్టర్ ద్వారా డెన్వర్‌లోని ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన మరో నలుగురిని అల్బుకార్క్లోని హోలీక్రాస్ ఆస్పత్రికి, న్యూ మెక్సికో హెల్త్ యూనివర్సిటీకి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టానికి పంపించారు. కాల్పులకు పాల్పడిన నిందితులు అందరినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెడ్ రివర్ మెమోరియల్ డే సందర్భంగా రెడ్ రివర్ ఏరియాలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో జనం వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీ లక్ష్యంగా దుండగులు కాల్పులు జరిపారు. కాగా, న్యూ మెక్సికోలో రెండు వారాల వ్యవధిలోనే రెండు సార్లు కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కలవరపెడుతున్నది. ఈ నెల 16న జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు పోలీస్ అధికారులు గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

