US Woman | తన తెలివితేటలతో రూ.15 లక్షల ఇంటిని రూ.3కోట్ల విలువకు తెచ్చిన యువతి
US Woman | జీవితంలో అనుకున్నవి సాధించాలంటే కృషి, పట్టుదల ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టు తెలివి కూడా ఉండాలి. అందుకు నిదర్శనమే ఈ యువతి. తన అపారమైన తెలివితేటలు, అనుభవంతో రూ.15 లక్షలు కూడా విలువ చేయని ఓ పురాతన శిథిలా వస్థలో ఉన్న ఇంటిని ఏకంగా రూ.3 కోట్ల విలువకు తీసుకొచ్చి అందరి చేతా శెభాష్ అనిపించుకుంటోంది.
US Woman | జీవితంలో అనుకున్నవి సాధించాలంటే కృషి, పట్టుదల ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్టు తెలివి కూడా ఉండాలి. అందుకు నిదర్శనమే ఈ యువతి. తన అపారమైన తెలివితేటలు, అనుభవంతో రూ.15 లక్షలు కూడా విలువ చేయని ఓ పురాతన శిథిలా వస్థలో ఉన్న ఇంటిని ఏకంగా రూ.3 కోట్ల విలువకు తీసుకొచ్చి అందరి చేతా శెభాష్ అనిపించుకుంటోంది.
అమెరికాకు చెందిన 30 ఏళ్ల బెట్సీ స్వీనీ (Betsy Sweeney).. 2020 కరోనా సమయంలో పశ్చిమ వర్జీనియాలోని వీలింగ్ నగరంలో 120 ఏళ్ల నాటి ఓ పాత ఇంటిని కొనుగోలు చేసింది. అది కూడా కేవలం 18వేల డార్లకు నివసించేందుకు వీలులేని (unlivable house) ఇంటిని కొనుక్కుంది. ఇల్లు పూర్తిగా శిథిలా వస్థలో ఉండటంతో దాన్ని ఎలాగైనా ఓ రూపానికి తీసుకురావాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో ఆర్కిటెక్చర్లో అపారమైన అనుభవం ఉన్న స్వీనీ.. తన తెలివితేటలను ఉపయోగించి ఆ ఇంటిని ఎంతో సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
పాకెట్ డోర్స్, విక్టోరియన్ ఫైర్ ప్లేస్‌లు, పాతకాలపు బాత్‌టబ్ వంటివాటిని సంరక్షించడంతోపాటు పునర్నిర్మాణానికి లక్ష డాలర్లు ఖర్చు చేసింది. ఈ ఇంటి పునర్నిర్మాణానికి ఉపయోగించిన సొమ్ము మొత్తం ఆమె లోన్ కింద తీసుకుంది. ఇక ఇంటి పునర్నిర్మాణం కోసం కొంతమంది నిపుణులను కూడా నియమించుకుంది. ఇలా రాత్రీ పగలు కష్టపడి పాడుపడిన ఆ ఇంటిని ఎంతో విలాసవంతమైన ఆకర్షణీయమైన ఇంటిగా మార్చేసింది. ఇప్పుడు ఆ ఇల్లు 3.75లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.3,12,13143 సమానం) పలుకుతోంది.
‘బిజినెస్ ఇన్సైడర్’ నివేదిక ప్రకారం.. ఆ ఇంటి కోసం బెట్సీ మొత్తం 1.60 లక్షల డాలర్లు ఖర్చు చేసింది. ఇంటి పునరుద్ధరణకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో షేర్ చేసింది. ఇప్పుడీ ఇంటిని తాను కనుక అమ్మకానికి పెడితే 2,40,000 డాలర్లకు లిస్ట్ చేస్తానని తెలిపింది. అయితే, ఉన్నతస్థాయిగా పరిగణించే పరిసరాల్లో తన ఇల్లు ఉండడంతో దానికి 3.75 లక్షల డాలర్ల వరకూ ధర పలుకుతుందని సంతోషంగా చెబుతోంది. ఇంటి రినోవేషన్‌కు సంబంధించిన వీడియోలను కూడా స్వీనీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Sukhwinder Singh Sukhu | ఢిల్లీ ఎయిమ్స్‌కు హిమాచల్ సీఎం
Mukesh Ambani | కొత్త శకానికి నాంది.. రిలయన్స్ బోర్డులోకి చేరిన అంబానీ పిల్లలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

