వాషింగ్టన్: 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దేశ భద్రతపై ఆందోళన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీంతో అఫ్గానిస్థాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్విటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ నుంచి అమెరికాకు ప్రయాణాలు చేసే అవకాశం ఉండదు.
ఈ నెల 9న ఉదయం 12.01 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్థాన్, వెనెజులా నుంచి అమెరికాకు వెళ్లేవారిపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాక్షిక ఆంక్షలు విధించింది.