అమెరికాలో 17 వేలకు చేరిన మంకీపాక్స్ కేసులు.. బైడెన్‌పై అమెరికన్ల ఆగ్రహం
హైదరాబాద్ : అమెరికాలో మంకీపాక్స్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 17 వేల పాజిటివ్ కేసులు నమోదైనట్లు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం వెల్లడించింది. న్యూయార్క్‌లో అత్యధికంగా 3,124 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కాలిఫోర్నియాలో 3,291, ఫ్లోరిడాలో 1,739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మంకీపాక్స్ కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది.
నివారణ చర్యలు చేపట్టినప్పటికీ మంకీపాక్స్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయని సీడీసీ డైరెక్టర్ రోచెల్లి వాలెన్స్కీ తెలిపారు. సెప్టెంబర్ నుంచి మంకీపాక్స్ వ్యాక్సిన్ ప్రజలకు అదనంగా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. సరిపడా మంకీపాక్స్ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచలేకపోవడంతో అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. నివారణ చర్యల్లోనూ బైడెన్ విఫలమయ్యారని అమెరికా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

