Arunachal Pradesh | అరుణాచల్ భారత్‌లో అంతర్భాభాగమే.. చైనాకు తేల్చిచెప్పిన అమెరికా
అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) భారత్‌లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది.
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) భారత్‌లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది. అరుణాల్‌ను దక్షిణ టిబెట్‌గా (జాంగ్నాన్) అభివర్ణిస్తున్న చైనా.. అది తమదేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణాచల్ భారత్‌లో అంతర్భాగంగా వాషింగ్టన్ గుర్తిస్తున్నదని అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ప్రకటించారు. సైన్యం లేదా పౌరులు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) అవతల ఆక్రమణలకు పాల్పడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని వెల్లడించారు.
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మొండిగా వ్యవహరిస్తూ వస్తున్న చైనా.. తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఇటీవల ప్రధాని మోదీ సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది. జాంగ్నాన్ (Zangnan) తమదేని, సేలా సొరంగాన్ని భారత్ చట్టవిరుద్ధంగా స్థాపించిందంటూ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ షియాగాంగ్ (Zhang Xiaogang) గత శుక్రవారం వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చైనా ప్రకటన అసంబద్ధమైనదని, అరుణాచల్ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అరుణాచల్ భారత్‌లో అంతర్భాగంగా గుర్తిస్తున్నామని అమెరికా తాజాగా ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Arunachal Pradesh
- china
- India
- LAC
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

