సియాటెల్, సెప్టెంబర్ 17: భారత విద్యార్థిని కందుల జాహ్నవి మృతిపై అమెరికాలోని సియాటెల్ నగర మేయర్, పోలీసు చీఫ్ విచారం వ్యక్తం చేశారు.
జాహ్నవి మృతిని ఎగతాళి చేస్తూ పోలీసు అధికారి డానియెల్ అడెరర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు గానూ భారత కమ్యూనిటీకి క్షమాపణలు చెబుతున్నట్టు మేయర్ బ్రూస్ హారెల్, సియాటెల్ పోలీసు చీఫ్ అడ్రియన్ డియాజ్ పేర్కొన్నారు.