యూఎస్ నేవీ దుస్సాహసం.. భారత జలాల్లో ఆపరేషన్

న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన యూఎస్ నేవీ 7వ ఫ్లీట్ భారత్ అనుమతి లేకుండానే మన దేశ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఆపరేషన్ నిర్వహించింది. ఈ విషయాన్ని యూఎస్ నేవీయే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒక దేశ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్లో మిలిటరీ కసరత్తులు నిర్వహించే ముందు ఆ దేశ అనుమతి తీసుకోవాలి. కానీ యూఎస్ నేవీ మాత్రం ఈ నెల 7వ తేదీన లక్షద్వీప్‌కు 130 నాటికల్ మైళ్ల దూరంలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్లు నిర్వహించింది.
అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తాము ఈ కసరత్తులు నిర్వహించామని, భారత్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని ఆ ప్రకటనలో యూఎస్ నేవీ 7వ ఫ్లీట్ తెలిపింది. భారత్‌కు సన్నిహితంగా ఉండే వ్యూహాత్మక భాగస్వాముల్లో ఒకటైన అమెరికా చేసిన ఈ పని ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. గతంలోనూ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్లను తాము చేపట్టామని, భవిష్యత్తులోనూ ఇలాగే చేపడతామని అదే ప్రకటనలో యూఎస్ నేవీ చెప్పడం గమనార్హం.
ఈ ప్రకటనపై భారత నేవీగానీ, విదేశాంగ శాఖగానీ స్పందించలేదు. క్వాడ్ గ్రూపులో భాగంగా ఉన్న భారత్, అమెరికా ఈ మధ్యే జరిగిన సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారానికి అంగీకరించాయి. ఇందులో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్‌కు మద్దతు తెలపడం కూడా ఒకటి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

